Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ దిగ్గ‌జాన్ని క‌దిలించిన బుట్ట బొమ్మా!

చాలా లైవ్ ఈవెంట్ల‌లో బుట్ట బొమ్మాను ఆల‌పించిన ఆర్మాన్ తాజాగా మ‌రోసారి హైలైట్ చేసాడు.

By:  Tupaki Desk   |   13 March 2024 9:00 AM GMT
అంత‌ర్జాతీయ దిగ్గ‌జాన్ని క‌దిలించిన బుట్ట బొమ్మా!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' పాట‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఈ సినిమా పాట‌ల‌ను అనుక‌రిస్తూ చాలా మంది ప్ర‌జ‌లు వీడియోల‌ను రూపొందించారు. ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాల్లో ట్రెండ్ అయ్యాయి. ఇదే సినిమా నుండి 'బుట్ట బొమ్మా..' పాటకు పేర‌డీలు, అనుక‌ర‌ణ‌లు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పుడు ఒరిజిన‌ల్ ను ఆల‌పించిన గాయకుడు అర్మాన్ మాలిక్ ఒక ప్రైవేట్ సమావేశంలో బుట్ట‌బొమ్మా..కు తన నృత్య కదలికలను ప్రదర్శించ‌డం హెడ్ లైన్స్ లోకొచ్చింది. చాలా లైవ్ ఈవెంట్ల‌లో బుట్ట బొమ్మాను ఆల‌పించిన ఆర్మాన్ తాజాగా మ‌రోసారి హైలైట్ చేసాడు. ఆస‌క్తిక‌ర‌మైన‌ విషయం ఏమిటంటే, సంచలనాత్మక హిట్ 'షేప్ ఆఫ్ యు'తో సుప‌రిచితుడైన‌ ఆంగ్ల గాయకుడు-గేయరచయిత ఎడ్ షీరాన్ ఊహించని విధంగా బుట్ట‌బొమ్మా స్టెప్పులు వేస్తూ క‌నిపించాడు.

ED ను అర్మాన్ ముంబై లోని ఓ ప‌బ్ లో క‌లిసారు. అక్క‌డ‌ బుట్ట బొమ్మా వైరల్ హుక్ స్టెప్‌ను షీరన్‌కు ఆర్మాన్ నేర్పిస్తున్న వీడియో వైర‌ల్ గా మారుతోంది. ఇది నిజంగా బ‌న్ని అభిమానుల‌కు అరుదైన సంతోష‌క‌ర‌మైన క్షణం అన‌డంలో సందేహం లేదు. ఒక అంత‌ర్జాతీయ దిగ్గ‌జాన్ని మ‌న‌ బుట్ట‌బొమ్మ క‌దిలించింది. 16 మార్చి 2024న ముంబైలో షెడ్యూల్ చేయబడిన ప్రత్యక్ష సంగీత కచేరీ కోసం ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు.

ఆర్మాన్ - ఎడ్ అక్క‌డ‌ బుట్టబొమ్మ పాట‌కు డ్యాన్స్ చేయడం నా 2024 బింగో కార్డ్‌లో లేదు, OMGG సో క్యూట్ ది స్ ఈజ్ ..అంటూ ఒక అభిమాని ప్ర‌శంసించాడు. అతను చాలా డౌన్ టు ఎర్త్ అంటూ మ‌రొక అభిమాని ఎడ్ షీర‌న్ ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాడు. ఫ్యాన్స్ ప్ర‌స్తుతం ఈ వీడియోని అంత‌ర్జాలంలో వేగంగా వైర‌ల్ చేస్తున్నారు.