Begin typing your search above and press return to search.

బిజినెస్ మెన్ 4K రీ రిలీజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ బ్లాస్ట్

ఇప్పటివరకు ఖుషి సినిమానే ఈ రీ ఈలీజ్ ట్రెండ్ లో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు బిజినెస్ మేన్ ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం విశేషం.

By:  Tupaki Desk   |   10 Aug 2023 1:49 PM GMT
బిజినెస్ మెన్ 4K రీ రిలీజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ బ్లాస్ట్
X

ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే భాషతో సంబంధం లేకుండా పదేళ్ల క్రితం విడుదలైన డబ్బింగ్ సినిమాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బిజినెస్ మేన్ సినిమాను ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఇక ఈసారి కూడా 4K వెర్షన్ లో వచ్చిన సినిమాకు ఊహించని స్థాయిలోనే కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక విభిన్నమైన క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అందుకున్న కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏరియాలో వారిగా చూసుకుంటే..

నైజాంలో 2.5 కోట్లు

సీడెడ్ 35.6 లక్షలు

ఈస్ట్ లో 34.2 లక్షలు

ఉత్తరాంధ్రలో 42.1 లక్షలు

కృష్ణలో 26.5 లక్షలు

గుంటూరులో 31.4 లక్షలు

నెల్లూరులో 7.13 లక్షలు

వెస్ట్ లో 15.28 లక్షలు

ఏపీ తెలంగాణ మొత్తం - 4.42 కోట్ల గ్రాస్ వచ్చింది.

బిజినెస్ మేన్ సినిమాకు ఈ స్థాయిలో మొదటి రోజు కలెక్షన్స్ వస్తాయి అని ఎవరో ఊహించలేదు. ఇప్పటివరకు ఖుషి సినిమానే ఈ రీ ఈలీజ్ ట్రెండ్ లో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు బిజినెస్ మేన్ ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే అక్కడ 35 లక్షలు రాబట్టిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా 26.76 లక్షలు అందుకుంది. ఇక కర్ణాటకలో 27.3 లక్షలు రాగా ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ మేన్ అందుకున్న గ్రాస్ కలెక్షన్స్ 5.31 కోట్లు.

ఈ దెబ్బతో మహేష్ బాబు ఈ ట్రెండులో టాప్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చేసాడు. మహేష్ బాబు పుట్టినరోజునే సినిమా విడుదల కావడంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మాస్ ఏరియాలలో అయితే అన్ని థియేటర్లు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఇసుకవేస్తే రాలనంత జనాలు కూడా థియేటర్ బయట కనిపించారు. మొత్తానికి గుంటూరు కారం అప్డేట్ పెద్దగా కిక్కి ఇవ్వకపోయినప్పటికీ బిజినెస్ మేన్ 4K తో మాత్రం ఫ్యాన్స్ తమ స్టార్ పుట్టిన రోజును హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు.