Begin typing your search above and press return to search.

దేవుడా.. ఇదేమి రెస్పాన్స్ రా బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో పోకిరి తర్వాత వచ్చిన సినిమా బిజినెస్ మెన్

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:28 AM GMT
దేవుడా.. ఇదేమి రెస్పాన్స్ రా బాబు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో పోకిరి తర్వాత వచ్చిన సినిమా బిజినెస్ మెన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికి బిజినెస్ మెన్ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్

నెగిటివ్ షేడ్స్ లోనే చాలా పాజిటివ్ గా ఉంటుంది. నిజానికి మహేష్ బాబు మూవీలో హీరో అనేకంటే అంతకుమించి అని చెప్పొచ్చు.

ఏ రంగంలో అయిన ఎదగాలంటే కసి ఉండాలి. ఒక రంగంలోకి వెళ్లాలని అనుకున్నప్పుడు మన ప్రయాణం ఒక్కడుగానే స్టార్ట్ అవుతుంది. తరువాత మన తెలివి, సామర్ధ్యంతోనే మన చుట్టూ జనం అందరూ చేరుతారు. మనల్ని పైన నిలబెట్టడానికి వారంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సహకరిస్తారు. వారంతా మనకి సహకరిస్తారు అంటే అది మన బలం. బలాన్ని నమ్ముకొని ముందుకి వెళ్ళాలి తప్ప భయపడుతూ ఉండకూడదు అనే మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది.

ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాని అంతు చూసే వరకు వదిలిపెట్టొద్దు. ఎవడి మాట అసలు వినొద్దు. నీ మాట నువ్వే విను. నీకు ఏం అదిచెయ్ అంటూ మహేష్ బాబు క్యారెక్టర్ తో పూరి జగన్నాథ్ చెప్పించిన డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందనే విషయంతో సంబంధం లేకుండా సూపర్ హిట్ చేసేశారు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు స్వార్ధంతోనే ఉన్నారు.

వాడు బాగుండాలనే స్వార్ధంతోనే బ్రతుకుతున్నాడు అంటూ అద్భుతమైన ఫిలాసఫీని చిత్రం ద్వారా పూరి చెప్పారు. ఇదిలా ఉంటే బిజినెస్ మెన్ మూవీ మళ్ళీ రీరిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ అభిమానుల నుంచి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి అదిరిపోయే స్పందన వచ్చింది.

థియేటర్స్ దగ్గర ఉన్న భారీ క్రౌడ్ ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రౌడ్ చూస్తుంటే సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది అర్ధమవుతోంది. ఇక బిజినెస్ మెన్ సినిమాతో రీరిలీజ్ రికార్డులని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత వరకు అందుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది.