Begin typing your search above and press return to search.

పూరి నెక్స్ట్ బిజినెస్మేన్ -2 ప‌క్కా అనేస్తున్నారే!

తాజాగా పూరి 'బిజినెస్ మేన్-2' చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నాడుట‌. ఇదే సీక్వెల్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు పూరి కేవ్ వ‌ర్గాల నుంచి లీకైంది.

By:  Tupaki Desk   |   7 March 2024 11:30 PM GMT
పూరి నెక్స్ట్ బిజినెస్మేన్ -2 ప‌క్కా అనేస్తున్నారే!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'బిజినెస్ మేన్' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ ఇద్ద‌రి కెరీర్ లోనే బిజినెస్ మేన్ బెస్ట్ మూవీగా నిలిచింది. గురువు రాంగోపాల్ వ‌ర్మ ఇచ్చిన ఐడియాతో శిష్యుడు పూరి రాసి తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ముంబైకి డాన్ లేడు...గ‌డ‌గ‌డ‌లాడించే ఓ డాన్ కావాలి అన్న పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని పూరి రాసుకుని తెర‌కెక్కించాడు.

మ‌హేష్ యాక్ష‌న్ లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్రంగా నిలిచింది. 'పోకిరి' త‌ర్వాత ఆ రేంజ్ పేరు తెచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాన‌ప్ప‌టికీ మ‌హేష్ కి పాన్ ఇండియాలో ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. పెద్ద క్రికెట‌ర్లు.. బిజినెస్ మేన్లు..పొలిటిష‌న్లు ఎంతో మంది లైక్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో 'బిజినెస్ మేన్ -2' కూడా చేయాల‌ని పూరి ఎప్ప‌టి నుంచో అనుకుం టున్నాడు.కానీ సాధ్య ప‌డ‌లేదు. ఇత‌ర హీరోల‌తో సినిమాలు చేయ‌డం..మ‌హేష్ వేర్వేరు ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డంతో వీలుప‌డ‌లేదు.

తాజాగా పూరి 'బిజినెస్ మేన్-2' చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నాడుట‌. ఇదే సీక్వెల్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు పూరి కేవ్ వ‌ర్గాల నుంచి లీకైంది. పాన్ ఇండియాకి క‌నెక్ట్ అయ్యే పాయింట్ తీసుకుని బిజినెస్ మెన్ రి రెండింత‌లు హైప్ వ‌చ్చేలా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారుట‌. దానికి సంబంధించిన బ్యాకెండ్ వ‌ర్క్ కూడా మొద‌లైంద‌ని స‌మాచారం.

పూరి డ‌బుల్ ఇస్మార్ట్ నుంచి బ‌య‌ట‌కు రాగానే పూర్తిగా ఈ సినిమా స్క్రిప్ట్ పైనూ కూర్చుంటాడ‌ని తెలి సింది. అయితే హీరో మాత్రం మ‌హేష్ అవ్వ‌డానికి ఛాన్సు లేదు. పూరి వైఫ‌ల్యాల నేప‌థ్యంలో మ‌హేష్ డేట్లు ఇచ్చే అవ‌కాశం లేదు. అలాగే మ‌హేష్ రాజ‌మౌళి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో రిస్క్ లు తీసుకునే ఛాన్స్ లేదు. కాబ‌ట్టి పూరి మ‌రో హీరోతో బిజినెస్ మేన్ -2 చేసే అవ‌కాశం ఉంది. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది హీరోల్ని త‌యారు చేసిన పూరి ఓ కొత్త స్టార్ ని త‌యారు చేయ‌డం పెద్ద విష‌యం కాదు. కాబ‌ట్టి మ‌హేష్ తోనే ఈ సినిమా చేయాల‌ని పూరి వెయిట్ చేసే అవ‌కాశం కూడా లేదు.