Begin typing your search above and press return to search.

రాజమౌళి ఆలోచన మార్చిన పూరి సినిమా ఏంటో తెలుసా?

ముఖ్యంగా సుకుమార్‌, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి రాజమౌళి పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 April 2025 10:00 PM IST
Rajamouli’s Respect for Puri Jagannadh
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌ అనడంలో సందేహం లేదు. ఆయన నుంచి వచ్చిన ఈగ, బాహుబలి, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలు ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన విషయం తెల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఏకంగా ఇండియన్ సినిమాకు ఆస్కార్‌ అందించిన ఘనత రాజమౌళి దక్కించుకున్నాడు. అలాంటి రాజమౌళి ఫిల్మ్‌ మేకింగ్‌లో తనను తాను ఎప్పుడూ తోపు అనుకోడట. చిన్న సినిమాలను సైతం ప్రోత్సహిస్తూ, తాను సైతం ఆ సినిమాల నుంచి నేర్చుకుంటూ ఉంటాను అంటాడు. ముఖ్యంగా సుకుమార్‌, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి రాజమౌళి పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం తెల్సిందే.

తాజాగా రాజమౌళి గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాజమౌళితో సన్నిహితంగా ఒక వ్యక్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రాజమౌళి తాను టెన్నిస్‌మేట్స్‌ అన్నారు. రెగ్యులర్‌గా తాను రాజమౌళి టెన్నీస్ ఆడుతూ ఉండేవాళ్లం. అప్పట్లో సక్సెస్‌ఫుల్‌ సినిమా ఎలా తీయాలి అనే విషయమై రాజమౌళ ఒక పుస్తకం రాస్తున్నట్లు చెప్పాడు. ఆ బుక్‌ పూర్తి అయిన తర్వాత దాన్ని తనకు ఇస్తానని చెప్పాడు. కానీ మహేష్‌ బాబు, పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్‌మెన్‌ సినిమా మొత్తం మార్చేసింది. బిజినెస్‌మెన్‌ సినిమాను చూసిన తర్వాత రాజమౌళి తాను రాస్తున్న సక్సెస్‌ సినిమాకు దారి పుస్తకంను చించేశాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.

బిజినెస్‌మెన్‌లో హీరోను దర్శకుడు పూరి జగన్నాధ్‌ చూపించిన తీరుతో రాజమౌళి వ్యూ మొత్తం మారిపోయిందట. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే అభిప్రాయంను కలిగి ఉన్న రాజమౌళి ఆ సినిమా చూసిన తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు. అన్ని విధాలుగా సినిమాను చేసే వీలు ఉందని, కొన్ని కండిషన్స్ పెట్టుకుని సినిమాను చేయాల్సిన అవసరం లేదని ఆయన భావించాడు. అందుకే సక్సెస్ మంత్ర బుక్‌ను ఆయన చించి అవతల పాడేశాడు. ఆ సినిమా తర్వాత తన మేకింగ్‌ విషయంలోనూ చాలా మార్పులు చేర్పులు తీసుకు వచ్చాడు. విలన్స్‌ను అత్యంత పవర్‌ ఫుల్‌గా చూపించడం జక్కన్న చేస్తున్న పని అనే విషయం తెల్సిందే.

ప్రస్తుతం రాజమౌళి సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో ఒక సినిమాను చేస్తున్నాడు. తన గత చిత్రాలతో పోల్చితే ఏమాత్రం తగ్గకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల విషయంలో గత సినిమాలను తలదన్నే విధంగా ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా గురించి రాజమౌళి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ముందు ముందు కూడా సినిమా గురించి ఆయన ఏం అప్డేట్స్ ఇస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటి, గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించబోతుంది. అంతే కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్‌ సైతం ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.