Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కంటే ముందుగానే ఆ దర్శకుడితో బన్నీ?

జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:23 AM GMT
త్రివిక్రమ్ కంటే ముందుగానే ఆ దర్శకుడితో బన్నీ?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఖరారు అయిపోయింది.

ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి ప్రాజెక్టుపై దృష్టి పెట్టబోతున్నారు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బన్నీకి స్టోరీ చెప్పి లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందంట.

సోషియో ఫాంటసీ కథాంశంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను ఆవిష్కరించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. తనలోని కథకుడుని బయటకు తీసుకొచ్చి అల్లు అర్జున్ కోసం అద్భుతమైన మైథాలజికల్ టచ్ ఉన్న పాయింట్ తో కథను సిద్ధం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ లోగా అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తనకు అందించిన బోయపాటికి మరో అవకాశం అల్లు అర్జున్ ఇవ్వబోతున్నారు అని సమాచారం. ఇప్పటికే గీత ఆర్ట్స్ బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈ సినిమా బాలయ్యతో ఉంటుందని అందరూ భావించారు. కానీ అల్లు అర్జున్ హీరో గానే బోయపాటిని కథని సిద్ధం చేయమని చెప్పినట్లుగా టాక్.

ఈ లోగా బోయపాటి తన కథతో బన్నీ మెప్పిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందే ఈ సినిమా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బన్నీ వాస్ నిర్మాతగా ఈ సినిమా ఉండనున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఏడాది పుష్ప 2 రిలీజ్ తర్వాతనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.