Begin typing your search above and press return to search.

ఇది ఆ హిట్ కథకు రీమేక్ కాదు

అయితే తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు నిర్మాత బన్నీ వాసు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:48 AM GMT
ఇది ఆ హిట్ కథకు రీమేక్ కాదు
X

గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్​పై తెరకెక్కుతున్న కోట బొమ్మాళి పి.ఎస్‌ సినిమా.. మలయాళ హిట్‌ చిత్రం నాయట్టుకు రీమేక్‌ అని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు నిర్మాత బన్నీ వాసు. ఈ సినిమాలోని లింగి లింగి లింగిడి సాంగ్​కు శ్రోతల నుంచి మంచి రెస్పాన్ రావడం వల్ల.. హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ పెట్టారు.

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్తున్న కోట బొమ్మాళి సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేస్తున్నారు. జానపదాన్ని ఈ సినిమాలో పెట్టేందుకు నిర్మాతగా తాను చాలా కష్టం పడినట్లు తెలిపారు బన్నీ వాసు. ఫోక్‌ సాంగ్‌ రైట్స్‌ తీసుకోవడం కన్నా సాధారణ పాటను రూపొందించడమే బెటర్‌ అనిపించినట్లు చెప్పారు. రేలారే రేలా రఘు నుంచి ఈ సినిమాలోని లింగిడి పాట తీసుకున్నట్లు వివరించారు.

రీమేక్ పుకార్లు గురించి మాట్లాడుతూ.. "ఇది మలయాళ సినిమా నాయట్టు రీమేక్‌ అని చాలామంది భావిస్తున్నారు. ఆ చిత్రంలోని రెండు మూడు సీన్స్​ను స్ఫూర్తిగా తీసుకుని చేశాం అంతే. అందులోని పాత్రలు, కోట బొమ్మాళిలోని పాత్రలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పక్కా తెలుగు కమర్షియల్‌ సినిమా. సినిమాను మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా తీశాం. నాయట్టు.. ఓ అద్భుతం. నాయ‌ట్టు లాంటి క్లాసిక్‌ను రీక్రియేట్ చేయాల‌ని అనుకోలేదు. అక్టోబరు 13 లేదా నవంబరు 24న ఈ సినిమాను రిలీజ్​ చేయానుకుంటున్నాం. కాపీ సిద్ధమైన సమయం ఆధారంగా వాటిల్లో ఏదోక డేట్‌ ఫిక్స్‌ చేస్తాం" అని అన్నారు.

కాగా, రెండేళ్ల కింద‌ట మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింగి నాయ‌ట్టు చిత్రం. జోజు జోసెఫ్‌, కుంచుకో బోబ‌న్, నిమిష స‌జ‌య‌న్ ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. మార్టిన్ ప్ర‌కాట్ రూపొందించారు. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్​.. క‌ల్ట్ స్టేట‌స్​ను అందుకుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు అప్పుడే తెలుగులో వార్తలొచ్చాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రావు ర‌మేశ్​, ప్రియ‌ద‌ర్శి, అంజ‌లి ముఖ్య పాత్ర‌ల్లో క‌రుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాను సీన్స్​ను స్ఫూర్తిగా తీసుకుని కోటా బొమ్మాళి చేస్తున్నారు.