Begin typing your search above and press return to search.

అతను పక్క ఉంటేనే అల్లు అర్జున్ కథలు వింటాడా..?

అల్లు అర్జున్ కి ఇష్టమైన వ్యక్తుల్లో వంశీ ఒకరు. ఒకసారి కథా చర్చల్లో కుర్చునే టైం లో వంశీని కూడా మనతో కథ వినేందుకు పిలువని చెప్పారట బన్నీ

By:  Tupaki Desk   |   4 Feb 2024 11:51 AM GMT
అతను పక్క ఉంటేనే అల్లు అర్జున్ కథలు వింటాడా..?
X

అల్లు అర్జున్ కథ వినేప్పుడు ఎవరెవరిని పక్కన ఉంచుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే పెద్ద డిస్కషన్. తన ప్రతి సినిమాను ముందు సినిమా రేంజ్ కన్నా ఎక్కువ చేసుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ రేంజ్ వెళ్లాడు అల్లు అర్జున్. దాని వెనుక అతని కష్టం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. సినిమా అంటే ఇష్టం ఉంటే సరిపోదు దాని కోసం తగిన విధంగా కష్టపడాలి అని అందరు అంటుంటారు. అలాంటి కష్టం ఒక నిర్మాత కొడుకుగా పడాల్సిన అవసరం లేదు కానీ ప్రేక్షకులు తన మీద చూపుతున్న ప్రేమ అభిమానులు తన మీద పెట్టుకున్న ఆశలు నిజం చేయాలంటే ఒళ్లు హూనం చేసుకోక తప్పదు.

అందుకే స్టైలిష్ స్టార్ గా కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితమైన అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగాడు. పుష్ప 1 లో పుష్ప రాజ్ పాత్రలో పూనకాలు తెప్పించేసిన అల్లు అర్జున్ మరోసారి అలాంటి వైబ్రేషన్స్ తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ స్టోరీ సిట్టింగ్స్ లో ఎవరెవరిని పిలుస్తాడన్న డిస్కషన్స్ లో లేటెస్ట్ గా నిర్మాత బన్నీ వాసు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లేటెస్ట్ గా ఆయన ముఖ్య గమనిక సినిమా ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఆ సినిమాలో హీరో విరాన్ అలియాస్ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు బన్నీ వాసు.

అల్లు అర్జున్ కి ఇష్టమైన వ్యక్తుల్లో వంశీ ఒకరు. ఒకసారి కథా చర్చల్లో కుర్చునే టైం లో వంశీని కూడా మనతో కథ వినేందుకు పిలువని చెప్పారట బన్నీ. వంశీ జడ్జిమెంట్ బాగుంటుందని అల్లు అర్జున్ చెప్పారట. ఇక ఎప్పుడో 9 ఏళ్ల క్రితం వంశీ హీరో అవుతానని అన్నాడు ఇప్పటికి అది కుదిరింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అన్నారు బన్నీ వాసు. అంతేకాదు వంశీ సినిమా ఈవెంట్ అనగానే మా వంశీని పుష్ చేస్తున్నందుకు థాంక్స్ అని కూడా బన్నీ చెప్పినట్టు వెల్లడించారు బన్నీ వాసు. అయితే అల్లు అర్జున్ కథలను విని జడ్జిమెంట్ చేశాడంటే తప్పకుండా హీరోగా విరాన్ అలియాస్స్ వంశీకి కథల విషయంలో మంచి పట్టు ఉందని చెప్పొచ్చు.