Begin typing your search above and press return to search.

AAA: క్రేజీ కాంబో.. ట్వీట్​తో బన్నీ హింట్​..

అయితే ఈ ట్వీట్​పై సంగీత దర్శకుడు అనిరుధ్ 'థాంక్యూ మై బ్రో' అంటూ రియాక్ట్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 1:41 PM GMT
AAA: క్రేజీ కాంబో.. ట్వీట్​తో బన్నీ హింట్​..
X

'పుష్ప ది రైజ్' చిత్రంతో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'పుష్ప ది రూల్' షూటింగ్​తో బిజీగా ఉన్న ఆయన నెక్స్ట్​ లైనప్​ గురించి టాలీవుడ్​ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్​గా మారింది. గత కొద్ది రోజులుగా అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అది దాదాపుగా కన్ఫామ్ అని అర్థమవుతోంది.

వివరాళ్లోకి వెళితే.. దర్శకుడు అట్లీ రీసెంట్​గా బాలీవుడ్ బాద్​ షా షారుక్​ ఖాన్​తో ఓ జవాన్ చిత్రం భారీ హిట్​ను ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల మోత మోగిస్తూ దుసుకెళ్తోంది. ఇదే సమయంలో అట్లీ .. తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్​తో కలిసి చేస్తారన్న టాక్​ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

అయితే తాజాగా అల్లు అర్జున్​ చేసిన ఓ ట్వీట్​తో ఈ టాపిక్​ మరోసారి తెరపైకి వచ్చింది. 'జవాన్' సక్సెస్​పై బన్నీ స్పందిస్తూ మూవీటీమ్​కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హీరో షారుక్ ఖాన్​తో పాటు విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్​​, దర్శకుడు అట్లీని పేరు పేరున కొనియాడారు.

అయితే ఈ ట్వీట్​పై సంగీత దర్శకుడు అనిరుధ్ 'థాంక్యూ మై బ్రో' అంటూ రియాక్ట్ అయ్యాడు. దానికి బన్నీ.. 'థాంక్యూ సరిపోదు.. నాకు మంచి పాటలు కావాలి' అంటూ అనిరుధ్​ ట్వీట్​కు బదులిచ్చారు. ఈ ట్వీట్​ కాస్త నెట్టింట్లో వైరల్ అయిపోయింది. దీంతో అట్లీ-అర్జున్-అనిరుధ్(AAA) కాంబో కన్ఫామ్​ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు రూమర్స్​ అనుకుంటున్న ఈ విషయాన్ని బన్నీ రిప్లైతో కన్ఫామ్​​ చేసేశారంటూ అభిమానులు ఖుషీ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కాంబోలో ప్రాజెక్ట్​ రానుందటూ నెట్టింట్లో ట్రెండ్​ చేస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్.. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్​తోనూ చెరో సినిమాను ఓకే చేశారు. పుష్ప 2 తర్వాత సందీప్​ వంగతో చేయనున్నారు. ఈ చిత్రం తర్వాతే అట్లీతో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..