Begin typing your search above and press return to search.

నాలుగు నుంచి బ‌న్నీ బ‌రిలోకి!

ఇక న‌వంబ‌ర్ 3 నుంచి య‌ధావిధిగా మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. బ‌న్నీ 4వ తేది నుంచి షూటింగ్ కి హాజ‌రు కానున్నారుట‌.

By:  Tupaki Desk   |   3 Nov 2023 12:30 AM GMT
నాలుగు నుంచి బ‌న్నీ బ‌రిలోకి!
X

పాన్ ఇండియా చిత్రం 'పుష్ప‌-2' నుంచి అప్ డేట్ వ‌చ్చి చాలా రోజుల‌వుతుంది. కొన్ని రోజులుగా యూనిట్ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు. బ‌న్నీ న్యూలుక్ తర్వాత షూటింగ్ విష‌యాలు కూడా వెలుగులోకి రాలేదు. అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత భాగం షూటింగ్ పూర్త‌యింది? పెండింగ్ ఎంత‌వ‌ర‌కూ ఉంది? అంటూ నెట్టింట అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కానీ వాటికి మేక‌ర్స్ ఎలాంటి బ‌ధులు ఇవ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో యూనిట్ వ‌ర్గాల నుంచి చాలా విష‌యాలే తెలుస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ 60 శాతం పూర్త‌యిందిట‌. మేజ‌ర్ స‌న్నివేశాలు చాలా వ‌ర‌కూ ఇందులోనే ఉన్నాయ‌ని అంటున్నారు. బ్యాలెన్స 40 శాతం కూడా వేగంగా పూర్తిచేసే ప్లాన్ లో టీమ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ జ‌ర‌గ‌లేదు. బ‌న్నీకి ఈ ర‌క‌మైన గ్యాప్ దొర‌క‌డంతో ఇట‌లీలో వ‌రుణ్ తేజ్ పెళ్లికి హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి షూటింగ్ ఉంటే గ‌నుక బ‌న్నీ ఇట‌లీ వ‌ర‌కూ వెళ్లే వారు కాద‌ని అంటున్నారు. ముందు నుంచి షూటింగ్ లేక‌పోవ‌డంతో వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇక న‌వంబ‌ర్ 3 నుంచి య‌ధావిధిగా మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. బ‌న్నీ 4వ తేది నుంచి షూటింగ్ కి హాజ‌రు కానున్నారుట‌. ఇట‌లీ నుంచి నేరుగా హైద‌రాబాద్ కి చేరుకోగానే బ‌న్నీ సెట్స్ కే వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది.

దీపావ‌ళి సంద‌ర్భంగా అభిమానుల కోరిక మేర‌కు సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ అధికారికంగా ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. టీజ‌ర్..ట్రైల‌ర్ లాంటివి ఇప్ప‌ట్లో ఎలాగూ సాధ్యం కాబ‌ట్టి మ‌రో కొత్త పోస్ట‌ర్ తోనో..గ్లింప్స్ తోనే ఫ్యాన్స్ దాహం తీర్చే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి బాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో అక్క‌డి ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని మెజార్టీ పార్టు అక్క‌డ క‌నెక్ట్ అయ్యేలా సుకుమార్ జాగ్ర‌త్త ప‌డుతున్నారుట‌. దీనికి సంబంధించి స‌న్నివేశా పరంగా అప్ప‌టిక ప్పుడు కొన్ని మార్పులు చేస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.