Begin typing your search above and press return to search.

వైర‌ల్ ఫోటో: భార్య‌కు త‌ల్లో నాలుక ఈ అల్లూ

అల్లు అర్జున్ భార్య స్నేహకు పార్టీకి ముందు సిద్ధమ‌య్యేందుకు హ‌డావుడి ప‌డుతుంటే క్యూట్‌గా సహాయం చేస్తాడు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:55 AM GMT
వైర‌ల్ ఫోటో: భార్య‌కు త‌ల్లో నాలుక ఈ అల్లూ
X

అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి జంట అన్యోన్య‌త లైఫ్ గోల్స్ గురించి తెలిసిందే. ఆద‌ర్శ దాంప‌త్యానికి సింబాలిక్ గా క‌నిపిస్తారు ఈ జంట‌. ఇటీవల ఇటలీ- టుస్కానీలో జరిగిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహానికి ఇద్దరూ తమ పిల్లలు అల్లు అయాన్ -అల్లు అర్హతో కలిసి హాజరయ్యారు. నవంబర్ 14న స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కాక్‌టెయిల్ పార్టీకి ముందు తీసిన తన కుటుంబం తాలూకా అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో అల్లు అర్జున్ తన భార్యకు హారాన్ని ధరించడానికి సహాయం చేస్తూ స్మార్ట్ గా కనిపించాడు.

అల్లు అర్జున్ భార్య స్నేహకు పార్టీకి ముందు సిద్ధమ‌య్యేందుకు హ‌డావుడి ప‌డుతుంటే క్యూట్‌గా సహాయం చేస్తాడు. నవంబర్ 14న, అల్లు స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్ - లావణ్య కాక్‌టెయిల్ నైట్ నుండి కొన్ని అరుదైన ఫోటోల‌ను షేర్ చేసారు. స్నేహా ఈ పోస్ట్‌కి అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది, "నాకు ఇష్టమైన వ్యక్తులతో అద్భుతమైన సాయంత్రం గడిపాను! (sic)" అని రాసారు. ఒక ఫోటోలో, బ‌న్ని కాక్‌టెయిల్ నైట్ కోసం తన భార్య నెక్లెస్‌ని ధరించడానికి ఇబ్బంది ప‌డుతుంటే త‌న‌వంతుగా ఇలా సహాయం చేస్తున్నాడు.

ఈ సంద‌ర్భంగా ఈ అంద‌మైన జంట లుక్ కూడా ఆక‌ట్టుకుంది. బాడీ-హగ్గింగ్ సిల్వర్ డ్రెస్‌లో స్నేహ డ్రాప్-డెడ్ గా కనిపించగా, అల్లు అర్జున్ ఈవెంట్ కోసం ఆల్ బ్లాక్ సూట్‌ను ఎంచుకున్నాడు.

అల్లు అర్జున్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' సినిమా చేస్తున్నాడు. ఈ సీక్వెల్ 15 ఆగస్ట్ 2024న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న - ఫహద్ ఫాసిల్ ఈ చిత్రం సీక్వెల్ గురించి ఉత్సాహంగా ఉన్నారు.

'పుష్ప 2' తర్వాత, అల్లు అర్జున్ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ఐకాన్ చేయాల్సి ఉంది. దానిపై త‌దుప‌రి అప్ డేట్ రావాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివతో టైటిల్ లేని చిత్రంలోను బ‌న్ని చేయ‌నున్నాడు. రజనీకాంత్ 'జైలర్' సినిమా విజయం తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ను కలిశాడు. నెల్స‌న్ తో సినిమా ఉందా లేదా? అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు.