Begin typing your search above and press return to search.

బ‌న్నీ-అట్లీ పాప్ సంచ‌ల‌నాన్నే ట‌చ్ చేస్తున్నారా?

కానీ త్రివిక్ర‌మ్ కి కూడా క‌మిట్ అమెంట్ ఇవ్వ‌డంతో బ‌న్నీ ముందుగా అత‌డితో ముందుకెళ్తాడా? అట్లీని ఒకే చెబుతాడా? అనే సందేహం ఉండేది.

By:  Tupaki Desk   |   26 March 2024 1:30 AM GMT
బ‌న్నీ-అట్లీ  పాప్ సంచ‌ల‌నాన్నే ట‌చ్ చేస్తున్నారా?
X

ఐకాన్ స్లార్ అల్లు అర్జున్ తో అట్లీ ప్రాజెక్ట్ సెట్ అయిన‌ట్లేనా? ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ ముగిసాయా? త‌దుపరి బ‌న్నీ ప్రాజెక్ట్ ఇదే అవుతుందా? అంటే దాదాపు క‌న్ప‌మ్ అయిన‌ట్లే తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్న‌ట్లు కొన్ని నెల‌లు గా వినిపిస్తూనే ఉంది. కానీ త్రివిక్ర‌మ్ కి కూడా క‌మిట్ అమెంట్ ఇవ్వ‌డంతో బ‌న్నీ ముందుగా అత‌డితో ముందుకెళ్తాడా? అట్లీని ఒకే చెబుతాడా? అనే సందేహం ఉండేది.

కానీ ఇప్పుడా సందేహం ఓ కొలిక్కి వ‌చ్చినట్లే క‌నిపిస్తోంది. అట్లీ స్టోరీకి బ‌న్నీ లాక్ అయిన‌ట్లు తాజాగా స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. అట్లీ కూడా ఈ కాంబినేష‌న్ లో సినిమాకి డిస్కో స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అత‌డి వికీలో సైతం అదే టైటిల అప్ డేట్ అయింది. ఈ రెండు సంఘ‌ట‌న‌ల కంటే ముందు అట్లీ భార్య ప్రియ కూడా ఓ వీడియో తో ఆ కాంబోపై అంచ‌నాలు పెంచేసారు. ఇవ‌న్నీ బ‌న్నీ ప్రాజెక్ట్ కోస‌మేన‌ని తాజాగా అందుతోన్న స‌మాచారం.

ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారుట‌. టైటిల్ తోనే అట్లీ -బ‌న్నీసంచ‌న‌లం కాబోతున్నార‌ని లీకులందుతున్నాయి. `డిస్కో స్టార్` టైటిల్ వెనుక మైఖెల్ జాక్సన్ ఉన్నాడన్న‌ది తాజా స‌మాచారం. ఈసినిమా క‌థ‌...మైఖెల్ జాక్స‌న్ జీవితాన్ని పోలి ఉంటుంద‌ని వినిపిస్తుంది. డిస్కో స్టార్ అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణ‌మే మైఖెల్ జాక్స‌న్ అని కోలీవుడ్ లో ఓ వార్త తెర‌పైకి వ‌స్తోంది. అదే నిజ‌మైతే ఇది సంచ‌ల‌న‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

త‌న డాన్సుతో ప్ర‌పంచాన్నే షేక్ చేసిన పాప్ సింగర్ మైఖెల్ జాక్స‌న్ ని ట‌చ్ చేస్తే అది ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ అవుతుంది. బ‌న్నీలో డాన్సింగ్ స్కిల్స్ కి-మైఖెల్ జాక్స‌న్ క‌థ‌ని మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహ‌కే అంద‌నిది. దానికి అట్లీ మార్క్ క‌మ‌ర్శియ‌ల్ ట‌చ‌ప్ ఇస్తే బాక్సాపీస్ వ‌ద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.