Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడితో బన్నీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..

ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉందంట. అలాగే కోలీవుడ్ స్టార్ అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:24 AM GMT
ఆ దర్శకుడితో బన్నీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. పుష్ప ది రూల్ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తాడని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా బోయపాటి శ్రీను తెరపైకి వచ్చారు. తాజాగా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సారి బన్నీ కోసం బోయపాటి పీరియాడికల్ జోనర్ కథని ఎంపిక చేసుకున్నారంట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఐదు భాషలలో ఈ సినిమాని బోయపాటి గ్రాండియర్ గా ఆవిష్కరించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉందంట. అలాగే కోలీవుడ్ స్టార్ అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుద్ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే సెకండ్ ఛాయస్ గా థమన్ అనుకుంటున్నారు. అయితే మేగ్జిమమ్ అనిరుద్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందంట.

ప్రస్తుతం అనిరుద్ దేవర మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీకి అనిరుద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ రెండు ఆల్బమ్స్ సూపర్ హిట్ అయితే మాత్రం నెక్స్ట్ టాలీవుడ్ లో అనిరుద్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక బోయపాటికి స్కంద మూవీ మ్యూజిక్ విషయంలో తమన్ తో కొద్దిగా విభేదాలు వచ్చినట్లు టాక్.

దీంతో అనిరుద్ వైపే బోయపాటి మొగ్గు చూపిస్తున్నారు. అల్లు అర్జున్ కి సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో బోయపాటి మీద బన్నీకి చాలా నమ్మకం ఉంది. దానికితోడు ఈ సారి జోనర్ మార్చి బోయపాటి పాన్ ఇండియా లెవల్ లో తన బ్రాండ్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనేది చూడాలి.