Begin typing your search above and press return to search.

మేమంతా ఒక్కటే.. ఎవరూ విడిపోలేదు: ఎస్కేఎన్

ఇప్పుడు ఆ విషయంపై నిర్మాత ఎస్కేఎన్.. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 8:15 PM IST
మేమంతా ఒక్కటే.. ఎవరూ విడిపోలేదు: ఎస్కేఎన్
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బాధ్యతలు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బీవీ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేసి మిత్రమండలి మూవీ చేస్తున్నారు. అయితే బన్నీ వాస్ కొత్త బ్యానర్ స్టార్ట్ చేయడంపై అనేక రూమర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ విషయంపై నిర్మాత ఎస్కేఎన్.. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.

"కొన్నిసార్లు నేను స్ట్రైట్ గా మాట్లాడకపోతే క్రాస్ గా వెళ్తుంటాయి. ఒక ఫ్యామిలీలో పెళ్లయినప్పుడు ఆ ఇల్లు చాలదు. అందుకే కొత్త ఇల్లు తీసుకుంటారు. దాని అర్థం ఉన్న ఇల్లు విడిచి వెళ్లిపోవడం కాదు. కొంతమంది కొన్ని రాసుకుంటారు. అందరూ విడిపోయారు.. పడిపోయారు అని రాస్తుంటారు" అని ఎస్కేఎన్ తెలిపారు.

"అల్లు అరవింద్ గారితో ఉండే వ్యక్తులు.. ఎప్పుడైనా సరే అరచేతిలో వేళ్ళు విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆ వేళ్ళు విడిగా ఉన్నాయని అనుకోవద్దు. అరవింద్ గారికి ఏ అవసరం వచ్చినా.. ఆ ఐదు వేళ్లు కలిసి పిడికిలిగా మారుతాయి. అదే అరవింద్ గారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ. ఆ పిడికిలే చిరు గారి భాషలో పంజా అంటారు" అని చెప్పారు.

"ఇప్పటికీ వాసు గానీ నేను గానీ ఎక్కడికో వెళ్లిపోయాం.. అయిపోయింది అని అనుకోవద్దు.. ఇప్పుడే స్టార్ట్ అయింది.. ఎందుకే చెప్పాలనుకున్నానంటే.. కలిసి ఉంటే వచ్చే ఆనందం మాకు తెలుసు.. అరవింద్ గారికి దూరంగా వెళ్లిపోతే టీజర్ లాంచ్ కు ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి మరీ ఆయన రావాల్సిన అవసరం లేదు" అని అన్నారు. మేమంతా ఒక్కటేనని చెప్పారు.

"మిత్రమండలి మూవీ విషయానికొస్తే.. ప్రియదర్శి గారు నాకు ఇష్టమైన నటుడు.. పెళ్లి చూపులు సినిమా నుంచి నెంబర్ కనుక్కొని మెసేజ్ పెడుతుంటాను. అప్పుడప్పుడు రిప్లై ఇస్తుంటారు. కోర్ట్ మూవీ తర్వాత బిజీ అయ్యారు. కోర్ట్ మూవీ తర్వాత ఆయన ఫోర్ట్ విస్తారించాలని నేను కోరుకుంటున్నాను" అని ఎస్కేఎన్ తెలిపారు.

"నిహారిక తెలుగులో రావాలనుకున్నప్పుడు టెస్ట్ షూట్ చేశాం. అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల వర్క్ చేయలేకపోయాం. ఫ్యూచర్ లో ఓ సినిమా మాతో చేయాలని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన కళ్యాణ్, భాను, సోమరాజ్ గారు, విజయేంద్ర గారికి మంచి హిట్ దక్కాలని అనుకుంటున్నా" అని చెప్పారు.

మిత్రమండలి సినిమా చూస్తుంటే జాతిరత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ వైబ్ వస్తుందని అన్నారు. అన్నీ హిట్ సినిమాలని చెప్పారు. వాటికి మించిన హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము అడగకపోయినా బన్నీ వాసు తమ సినిమాలకు పలు విధాలుగా హెల్ప్ చేస్తారని చెప్పారు. మిత్రమండలి అందరినీ అలరిస్తుందని పేర్కొన్నారు.