Begin typing your search above and press return to search.

గొడవలు వద్దు అని ఊరుకుంటున్నా : బన్నీ వాసు

అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కి అత్యంత ఆప్తుడిగా, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు, మీడియం రేంజ్‌ సినిమాలకు పెద్ద నిర్మాతగా బన్నీ వాసు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   1 May 2025 4:52 AM
గొడవలు వద్దు అని ఊరుకుంటున్నా : బన్నీ వాసు
X

అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కి అత్యంత ఆప్తుడిగా, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు, మీడియం రేంజ్‌ సినిమాలకు పెద్ద నిర్మాతగా బన్నీ వాసు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన సినిమాల్లోనే కాకుండా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ముఖ్య నాయకుడిగానూ కొనసాగుతున్నారు. జనసేన పార్టీకి ఆర్థిక మద్దతు పెద్ద ఎత్తున ఈయన ఇస్తూ ఉంటాడనే టాక్ ఉంది. మొత్తానికి సినిమా, రాజకీయాల పరంగా బన్నీ వాసు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవలే ఈయన తండేల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చాలా నమ్మకంతో నాగ చైతన్యతో భారీ బడ్జెట్‌తో తండేల్‌ను నిర్మించిన బన్నీ వాసు తాను అనుకున్నట్లుగానే రూ.100 కోట్ల వసూళ్లను దక్కించుకున్నాడు.

తండేల్‌ సినిమా పైరసీ అయిన సమయంలో మీడియా ముందుకు వచ్చి, సోషల్ మీడియా ద్వారా తన ఆగ్రహం ను వ్యక్తం చేసిన బన్నీ వాసు తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్ లో చేసిన ఒక ట్వీట్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సాదారణంగా ప్రతి విషయంలోనూ చాలా అగ్రెసివ్‌గా ఉండే బన్నీ వాసు ఎక్స్‌ లో యాక్టివ్‌గా ఉంటాడు. అలాంటి బన్నీ వాసు ఎక్స్‌ లో తాజాగా.... ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి..! అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. బన్నీ వాసు ట్వీట్‌కి మరో నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్‌ చేశాడు.

బన్నీ వాసు ట్వీట్‌కి నిర్మాత ఎస్‌కేఎన్‌ స్పందిస్తూ... అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే తరువాత సంగతి తరువాత అంటూ ట్వీట్‌ చేశాడు. చాలా మంది ఈ విషయం గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. ఇంతకు ఏ విషయం గురించి బన్నీ వాసు మాట్లాడాలి అనుకుంటున్నాడు, ఏ విషయం మాట్లాడితే గొడవలు అవుతాయని ఆగుతున్నాడు అనేది తెలియడం లేదు. చాలా విషయాలను నెటిజన్స్‌ ఊహిస్తున్నారు. చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాలని అనుకుని ఆగుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బన్నీ వాసు ట్వీట్‌ సోషల్‌ మీడియాలోనే కాకుండా నెట్టింట కూడా వైరల్‌ అవుతోంది.

అల్లు అర్జున్‌ సినిమాల వ్యవహారాలు చూసుకోవడం మొదలుకుని, గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకోవడం వరకు అన్ని విషయాలను బన్నీ వాసు చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల జాబితాలో చేరాడు. ఈయన కథల ఎంపిక చాలా బాగుంటుందని, సినిమా మేకింగ్‌ విషయంలో అల్లు అరవింద్‌ కంటే జాగ్రత్తగా ఉంటాడు అని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండాలని భావించే బన్నీ వాసు ఎందుకు ఇలాంటి ట్వీట్‌ చేయాల్సి వచ్చిందని ఇండస్ట్రీలోని వారు కూడా చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.