బన్నీ వాస్ 'మిత్రమండలి' టీజర్.. నవ్వులే నవ్వులు!
టాలీవుడ్ యువ నటులు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో మిత్రమండలి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 3:00 PM ISTటాలీవుడ్ యువ నటులు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో మిత్రమండలి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఎస్ విజయేందర్ దర్శకత్వం వహిస్తుండగా, సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్.ఎం. ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో కల్యాణ్ మంతిన, భానుప్రతాప, డా. విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్న మేకర్స్, మరో అప్డేట్ ఇచ్చారు.
రీసెంట్ గా అనౌన్స్ చేసిన విధంగా గురువారం మిత్రమండలి మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. వరల్డ్ అండ్ గ్యాంగ్ ఆఫ్ మిత్రమండలి అంటూ బన్నీ వాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం టీజర్.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. మూవీలో ఎంత కామెడీ ఉంటుందో టీజర్ ద్వారా అర్థమవుతుంది.
ఇదొక మంచి మ్యాచ్ ఆడటానికి అనుకూలమైన వాతావరణం టీజర్ స్టార్ట్ అయింది. ఈ బ్యాట్స్ మెన్ పైనే అన్ని హౌప్స్ పెట్టుకొన్న బౌలింగ్ టీమ్.. అండర్ 19లో 20 ఇయర్స్ గా ఆడుతున్న స్పిన్ బౌలర్.. వికెట్ కీపర్ ఉత్సాహం చూస్తుంటే అన్ని గోల్స్ ఆపేలా ఉన్నాడు.. ఈ ఫీల్డర్ బౌండరీని వదిలేసి తెలివిగా తన బంతుల్ని కాపాడుకున్నాడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా.. ఫీల్డింగ్ ఎంచుకుంది అంటూ లీడ్ రోల్స్ ను మేకర్స్ పరిచయం చేశారు.
వారంతా బ్యాట్ లేకుండా క్రికెట్.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు.. ఎవరో ఒకరిని వెర్రి పప్ప చేస్తారని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా సత్య రంగంలోకి దిగుతారు. అప్పుడే స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎస్ ఐ గా ఎంట్రీ ఇస్తారు. ఓవరాల్ గా సినిమాలోని రోల్స్ ను మేకర్స్ టీజర్ ద్వారా రివీల్ చేసేశారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్రేజీ అండ్ ఫన్నీగా ఉంది. సినిమా మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించనుందని క్లియర్ గా తెలుస్తోంది. టీజర్ అంతా పంచ్ ల తోనే ఉండగా, డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్లు ఇంకా క్రేజీ గా ఉన్నాయి. రన్నింగ్ కామెంట్రీ నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి టీజర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.
