Begin typing your search above and press return to search.

మాస్క్ తో నలుగురు.. మూడు సంస్థలు.. ఫుల్ మ్యాడ్నెస్!

తండేల్, ఆయ్, సింగిల్ చిత్రాలు.. బన్నీ వాస్, భాను ప్రతాప్ కాంబోలో రాగా మంచి హిట్స్ అయ్యాయన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2025 1:46 PM IST
Bunny Vas, Sapta Ashwa & Vyra Join Hands Entertainer Pre-Look Poster
X

టాలీవుడ్ కు చెందిన మూడు నిర్మాణ సంస్థలు బన్నీ వాస్ వర్క్స్ , సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్.. ఓ ఇంట్రెస్టింగ్ మూవీ కోసం చేతులు కలిపాయి. అందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా..

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నిర్మించి మంచి హిట్స్ అందుకున్న బన్నీ వాస్.. ఇప్పుడు బీవీ వర్క్స్ బ్యానర్ పై ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు గాను నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ తో చేతులు కలిపారు. అయితే ఇప్పటికే సప్త అశ్వ క్రియేటివ్స్ భాను ప్రతాప్ తో బన్నీ వాస్ ఇప్పటికే వర్క్ చేశారు.

తండేల్, ఆయ్, సింగిల్ చిత్రాలు.. బన్నీ వాస్, భాను ప్రతాప్ కాంబోలో రాగా మంచి హిట్స్ అయ్యాయన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.. హాయ్ నాన్న వంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. దీంతో తాజాగా వారంతా కలిపి తీస్తున్న మూవీపై ఆడియన్స్ లో అంచనాలు నెలకొన్నాయి.

కాగా, ప్రీ లుక్ పోస్టర్ లో ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న నలుగురు వ్యక్తులు ఉన్నారు. దీంతో సినిమా.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్ తో ఉండే రోలర్ కోస్టర్ గా ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. మొత్తానికి ప్రీ లుక్ పోస్టర్.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతోపాటు నవ్విస్తుంది.

అదే సమయంలో జూన్ 6వ తేదీన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ సినిమాతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆర్.ఆర్. ధృవన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

బన్నీ వాస్, కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాకు సోమరాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌ గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌ గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా రాజీవ్ కుమార్ రామా వర్క్ చేస్తున్నారు. మరి మేకర్స్ రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.