Begin typing your search above and press return to search.

వీరమల్లు ఆపితే ఎక్కువ ఇంపాక్ట్.. స్క్రీన్స్ షాట్స్ అటు వెళ్లాయి: బన్నీ వాస్

ఆ విషయంపై ఇప్పటికే స్పందించిన పలువురు టాలీవుడ్ నిర్మాతలు పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 11:15 AM IST
వీరమల్లు ఆపితే ఎక్కువ ఇంపాక్ట్.. స్క్రీన్స్ షాట్స్ అటు వెళ్లాయి: బన్నీ వాస్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అంటూ వచ్చిన ప్రకటన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విడుదల సమయంలో కావాలని చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కూడా రేపింది.

అదే సమయంలో ఏపీ మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. థియేటర్స్ బంద్ అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ విషయంపై ఇప్పటికే స్పందించిన పలువురు టాలీవుడ్ నిర్మాతలు పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో 'హరిహర వీరమల్లు మూవీకి సంబంధం లేకుండా ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ వచ్చింది. ఆ చిత్రాన్ని టార్గెట్ చేయకపోయినా.. ఎవరో పవన్ కళ్యాణ్ ను మిస్ లీడ్ చేశారు' అంటూ హోస్ట్ ప్రస్తావించారు. దీంతో తనకు అంశం డీప్ గా తెలియదని బన్నీ వాస్ ఉన్నారు. తాను తర్వాత మళ్లీ వెళ్లలేదని ఆయన చెప్పారు.

"అయితే ఎగ్జిబిటర్స్ గ్రూప్స్ మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. నాకు క్లియర్ గా తెలియదు. అవి ఎక్కడ జరిగాయో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ మూవీని ఆపితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేలా కొన్ని గ్రూప్స్ లో చర్చలు జరిగాయట. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెళ్లాయి. ఇండస్ట్రీ తరఫు నుంచే ఎవరో కలెక్ట్ చేసి పంపించారు" అని చెప్పారు.

"జూన్ 1న థియేటర్స్ బంద్ అంటూ వచ్చిన ఆ టాపిక్ అయిపోయింది. మళ్లీ కాల్ చేసి థియేటర్స్ బంద్ చేద్దామని మీటింగ్ కు పిలిపించారు. అప్పుడు ఛాంబర్ లో మీటింగ్ పెడదామని.. అది అని.. ఇది అని.. ఉన్న స్క్రీన్ షాట్స్ అటు వెళ్లాయి. జూన్ 12న సినిమాను ప్లాన్ చేసుకున్నారు. దీంతో రియాక్షన్ గట్టిగా వచ్చింది" అని బన్నీ వాస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే పవన్ కళ్యాణ్ గారు తప్పుగా రియాక్ట్ అయ్యారని ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారని హోస్ట్ అడగ్గా.. ఆయనకు ఉన్న సమాచారం ప్రకారమే రియాక్ట్ అయ్యారని బన్నీ వాస్ తెలిపారు. ఆయన వద్దకు సమాచారం ఎలా చేరిందని.. ఏంటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు. తాను ఇప్పటికే చేసిన ట్వీట్ ఇరు వైపులకు సంబంధించినదని తెలిపారు.