Begin typing your search above and press return to search.

నాగవంశీ, నానిని 'బన్నీ వాస్' ఫాలో అవుతున్నారా?

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, హీరో- నిర్మాత నానిని ఫాలో అవుతున్నారా? అంటే సినీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 11:40 AM IST
నాగవంశీ, నానిని బన్నీ వాస్ ఫాలో అవుతున్నారా?
X

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, హీరో- నిర్మాత నానిని ఫాలో అవుతున్నారా? అంటే సినీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. వారిద్దరి దారిలో వెళ్లేందుకు.. బన్నీ వాస్ సరైన అండ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని సినీ ప్రియులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఎప్పటి నుంచో ఉన్న బన్నీ వాస్.. కొంతకాలంగా GA2 బ్యానర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆ నిర్మాణ సంస్థపై చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా ఆయ్ సహా పలు చిత్రాలతో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

సడెన్ గా బీవీ వర్క్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తన సొంత బ్యానర్ పై మిత్రమండలి మూవీ చేస్తున్నారు. అందులో అంతా యువ నటులే ఉన్నారు. డైరెక్టర్ కూడా యూతే. మొత్తం యంగ్ జెనరేషన్ తో సినిమా చేస్తున్నారు బన్నీ వాస్. బ్లాక్ బస్టర్ హిట్ జాతిరత్నాలు వైబ్స్ తో మిత్రమండలి తీస్తున్నారని చెప్పాలి.

అయితే సొంత బ్యానర్ ను స్టార్ట్ చేసిన బన్నీ వాస్.. తలుచుకుంటే బడా హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసే ఛాన్స్ ఆయనకు ఉంది. బడ్జెట్ కూడా పెట్టగలరు. కానీ ఇప్పుడు చిన్న సినిమాను తీస్తున్నారు. దాని వెనుక పెద్ద రీజన్ ఉందంటున్నారు సినీ ప్రియులు. చిన్న చిత్రాలతోనే బ్యానర్లకు పెద్ద వాల్యూ దొరుకుతుందని చెబుతున్నారు.

ఎగ్జాంపుల్ గా నాగవంశీ, నానిని చూపిస్తున్నారు. నిజానికి నాగవంశీ తన బ్యానర్ పై ఇప్పటికే రూపొందించిన మ్యాడ్, మ్యాడ్ సీక్వెల్, టిల్లు సిరీస్ చిత్రాలు ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బ్యానర్ కూడా ఫేమస్ అయింది. మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు మీడియా రేంజ్ హీరోలతో కూడా ఆయన వర్క్ చేస్తున్నారు.

అదే సమయంలో నాని.. అటు హీరోగా ఇటు నిర్మాతగా బిజీగా ఉన్నారు. రెండు బ్యానర్లను స్థాపించిన ఆయన.. ఒక బ్యానర్ పై చిన్న సినిమాలు తీస్తానని వెల్లడించారు. రీసెంట్ గా కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు బన్నీ వాస్ తన బ్యానర్ పై అదే దారిలో ముందుకు వెళ్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పాలి.

అయితే మిత్రమండలి మూవీపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్ ఎం సహా పలువురు లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. రీసెంట్ గా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ అందుకున్న గ్లింప్స్.. సినిమాపై అంచనాలు నెలకొల్పింది. జాతిరత్నాలు మూవీలాగే హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మిత్రమండలి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.