Begin typing your search above and press return to search.

బన్నీ వాస్ కొత్త బ్యానర్ ఎందుకు? ఏం జరిగింది?

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్యాషనేటెడ్ నిర్మాతల్లో బన్నీ వాస్ కూడా ఒకరు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 2:51 PM IST
Bunny Vas Starts Own Production House
X

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్యాషనేటెడ్ నిర్మాతల్లో బన్నీ వాస్ కూడా ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో భాగమయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాతగా హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.

100% లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీత గోవిందం వంటి అనేక హిట్స్ ను అందుకున్నారు బన్నీ వాస్. గత ఏడాది వచ్చిన ఆయ్ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. చిన్న సినిమాగా వచ్చిన ఆ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తండేల్ మూవీతో మెప్పించారు.

నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. అయితే ఆ మూవీ సమయంలో బన్నీ వాస్ సొంత బ్యానర్ స్టార్ట్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు బన్నీ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ ను మొదలుపెట్టారు. దానిపై ఇంట్రెస్టింగ్ మూవీని కూడా తీస్తున్నారు

అయితే అసలు బన్నీ వాస్ సొంత బ్యానర్ స్టార్ట్ చేయడానికి కారణమేంటోనని జోరుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కొంతకాలం క్రితం బన్నీ వాస్, అల్లు అరవింద్ మధ్య విబేధాలు వచ్చాయని ఊహాగానాలు వినిపించాయి. అల్లు అరవింద్ తన బంధువు విద్యా కొప్పినీడిని కంపెనీలోకి తీసుకున్న తర్వాత అవి వచ్చాయని టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో నిర్ణయాలు జాప్యం కావడం పట్ల బన్నీ వాస్ అసంతృప్తితో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ కు చెందిన పలు బడా నిర్మాణ సంస్థలతో పోలిస్తే గీతా ఆర్ట్స్.. దర్శకులకు అడ్వాన్స్ ఇవ్వడంలో లేట్ అవుతుందని, అందుకే ఇతర కాంపౌండ్‌లకు వెళ్లిపోతున్నారని టాక్.

కానీ ఏదేమైనా.. బన్నీ వాస్ ఇప్పుడు బ్యానర్ ప్రారంభించిన విషయం అల్లు అరవింద్ కే చెప్పే చేశారని తెలుస్తోంది. ఆయనకు సమాచారం ఇచ్చి, అనుమతి తీసుకున్నాక స్టార్ట్ చేశారని తెలిసింది. అయితే బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి మెల్లగా బయటకు రానున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి.