Begin typing your search above and press return to search.

రివ్యూవర్లకు బన్నీ వాస్ స్పెషల్ రిక్వెస్ట్

సస్పెన్స్ హారర్ మూవీ 'ఈషా' సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2025 4:17 PM IST
రివ్యూవర్లకు బన్నీ వాస్ స్పెషల్ రిక్వెస్ట్
X

సస్పెన్స్ హారర్ మూవీ 'ఈషా' సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సినిమాను రిలీజ్ చేస్తున్న బన్నీ వాస్ మాట్లాడుతూ సినీ విమర్శకులకు, రివ్యూవర్లకు ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు.

సాధారణంగా సినిమా బాగుందని రాయమని అడుగుతారు, కానీ బన్నీ వాస్ మాత్రం స్పాయిలర్స్ గురించి మాట్లాడారు. బన్నీ వాస్ ఏమన్నారంటే.. "మీరు రాసే రివ్యూలను, మీ అభిప్రాయాలను మేము వంద శాతం గౌరవిస్తాం. అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ నాదొక చిన్న పర్సనల్ రిక్వెస్ట్. దయచేసి సినిమా రిలీజైన మొదటి రెండు, మూడు రోజులు ఆ ఒక్క పాయింట్ గురించి మాత్రం రాయకండి" అని రివ్యూవర్లను కోరారు.

ఇంతకీ ఆ పాయింట్ ఏంటనేది కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక చిన్న థ్రిల్లర్ పాయింట్ రివీల్ అవుతుందట. సినిమా కథ మొత్తం ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతుందని, అదే ఈ సినిమాకు ఆయువుపట్టు అని బన్నీ వాస్ వివరించారు. ఆ ఒక్క ట్విస్ట్ మీదే సినిమా విజయం ఆధారపడి ఉందన్నమాట.

ఒకవేళ ఆ సస్పెన్స్ పాయింట్ రివ్యూల్లో బయటకు వచ్చేస్తే, థియేటర్ కు వచ్చి సినిమా చూసే ఆడియెన్స్ కు ఆ ఎక్స్ పీరియన్స్ ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడియెన్స్ ఆ థ్రిల్ ని ఫీల్ అవ్వాలంటే ఆ సీక్రెట్ మైంటైన్ చేయడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆ ఒక్క విషయంలో సహకరించమని కోరారు.

"సినిమా ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి అనేది నిర్మొహమాటంగా రాయండి. కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ని మాత్రం కొంచెం హోల్డ్ చేయండి" అని బన్నీ వాస్ పదే పదే రిక్వెస్ట్ చేయడం చూస్తుంటే, సినిమాలో ఆ ఎలిమెంట్ చాలా బలంగా ఉందని అర్థమవుతోంది. సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలకు స్పాయిలర్స్ పెద్ద శత్రువులు.

ఇక బన్నీ వాస్ చేసిన ఈ కామెంట్స్ తో 'ఈషా' సినిమాపై, ముఖ్యంగా క్లైమాక్స్ పై ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. డిసెంబర్ 25న థియేటర్లలో ఆ ట్విస్ట్ ఏంటో చూసి ఎంజాయ్ చేయమని టీమ్ కోరుతోంది. మరి అ ట్విస్ట్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.