బన్నీ - అట్లీ మూవీ ఆ ఇద్దరు మిస్సయిందేనా?
ఇండస్ట్రీలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒకరితో అనుకున్న ప్రాజెక్ట్ ఫైనల్ షేప్ వచ్చేసరికి మరో హీరోతో మొదలవ్వడం..అది బ్లాక్ బస్టర్‌గా మారడం తెలిసిందే
By: Tupaki Desk | 9 April 2025 3:00 AM ISTఇండస్ట్రీలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒకరితో అనుకున్న ప్రాజెక్ట్ ఫైనల్ షేప్ వచ్చేసరికి మరో హీరోతో మొదలవ్వడం..అది బ్లాక్ బస్టర్‌గా మారడం తెలిసిందే. అలా చాలా ప్రాజెక్ట్‌లు చేతులు మారి చివరికి ఊహించిన హీరో చేతికి చిక్కి బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా హిట్‌లుగా మారిన సందర్భాలు చాలానే చూశాం. ఇప్పుడు ఇదే తరహాలో మరో భారీ ప్రాజెక్ట్ ఇద్దరు హీరోల వరకు వెళ్లి చివరికి మరో స్టార్ చేతికి చిక్కింది. అదే బన్నీ - అట్లీ ప్రాజెక్ట్. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించబోతున్నారు.
బన్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి టెక్సాలజీతో తెరపైకిరానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సన్ పిక్చర్స్ ఏప్రిల్ 8 మంగళవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. బన్నీ 22వ ప్రాజెక్ట్‌గా సెట్స్‌పైకి రానున్న ఈ మూవీని దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో నిర్మించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌ని ముందు దర్శకుడు అట్లీ దళపతి విజయ్‌తో చేయాలనుకున్నాడట. వీళ్లిద్దరి కలయికలో వరుసగా మూడు సినిమాలు `తేరీ`, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలొచ్చాయి. ఈ మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్‌లుగా మారి వీరి కలయికలో హ్యాట్రిక్ హిట్‌లుగా నిలిచాయి. దీంతో విజయ్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని చేయాలని అట్లీ ప్లాన్ చేసుకున్నాడట. అంతే కాకుండా ఈ క్రేజీ మూవీ కోసం సన్ పిక్చర్స్ వద్ద భారీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అయితే అదే సమయంలో షారుక్ ఖాన్ నుంచి పిలుపు రావడం `జవాన్` చేయడం జరిగిపోయింది.
విజయ్ `గోట్`కు వెళ్లిపోయాడు. ఆ తరువాత అట్లీ ఇదే కథని సల్మాన్‌ఖాన్‌కు చెప్పాడని, ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అది జరగలేదు. ఇప్పుడు అదే కథని అల్లు అర్జున్‌తో అట్లీ చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఈ సినిమాని ఇద్దరు హీరోలతో చేయాలనుకున్న అట్లీ ఆ క్యారెక్టర్లని బన్నీకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని డ్యుయెల్ రోల్‌గా.. పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌గా మార్చాడని చెబుతున్నారు.
