Begin typing your search above and press return to search.

అస‌లు బుల్లిరాజు ఎలా దొరికాడంటే?

బుల్లిరాజు. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బుల్లిరాజు పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్.

By:  Tupaki Desk   |   10 Feb 2026 3:46 PM IST
అస‌లు బుల్లిరాజు ఎలా దొరికాడంటే?
X

బుల్లిరాజు. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బుల్లిరాజు పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. ఆ సినిమాలో అంద‌రి కామెడీ ఒకెత్త‌యితే, బుల్లిరాజు క్యారెక్ట‌ర్ లో రేవంత్ చేసిన కామెడీ మ‌రోక ఎత్తు. అందుకే సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర్వాత రేవంత్ సెల‌బ్రిటీ అయిపోవ‌డంతో ఆ పిల్లాడికి ఛాన్సులు కూడా క్యూ క‌ట్టాయి.

ఇప్పుడు రేవంత్ కీల‌క పాత్ర‌లో టాలీవుడ్ లో మ‌రో మూవీ రాబోతుంది. అదే హై. అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ సాయి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను లాంచ్ చేశారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బుల్లిరాజు అలియాస్ రేవంత్ గురించి, సినిమాలో అత‌న క్యారెక్ట‌ర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు డైరెక్ట‌ర్ సాయి కృష్ణ‌.

ఫోటో చూసి సెలెక్ట్ చేశా..

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా చేస్తున్న‌ప్పుడు పిల్లాడి పాత్ర కోసం ఎవ‌రిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న‌ప్పుడు తాను రేవంత్ ఫోటో చూశాన‌ని, ఆ ఫోటో చూసి బుల్లి రాజు క్యారెక్ట‌ర్ కు రేవంత్ ను సెలెక్ట్ చేసింది కూడా తానేన‌ని సాయి కృష్ణ చెప్పారు. ఆ సినిమాలో బుల్లి రాజు క్యారెక్ట‌ర్ కు తాము అనుకున్న దానికంటే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింద‌ని కూడా ఆయ‌న అన్నారు.

రేవంత్ పాత్ర‌పై భారీ అంచ‌నాలు

అస‌లు బుల్లిరాజును ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమ‌య్యేలా చేసిన తాను ఓ సినిమా చేస్తున్న‌ప్పుడు అత‌న్ని తీసుకోపోతే, ఆ పిల్లాడి క్రేజ్, ఎన‌ర్జీని వాడుకోక‌పోతే ఎలా అని రేవంత్ ను ఈ సినిమాలోకి తీసుకున్నాన‌ని, ఈ మూవీలో ఆ పిల్లాడి క్యారెక్ట‌ర్ కు పూర్తిగా కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చిన‌ట్టు డైరెక్ట‌ర్ తెలిపారు. సినిమాలో న‌టిస్తున్న అంద‌రికంటే ఆ పిల్లాడి పైనే అంద‌రికీ అంచ‌నాలుంటాయ‌నే విష‌యం త‌న‌కు తెలుస‌ని అందుకే ఆ పిల్లాడి క్యారెక్ట‌ర్ ను డిఫ‌రెంట్ గా మ‌లిచిన‌ట్టు సాయి కృష్ణ చెప్పారు.

బుల్లిరాజు ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించ‌గా, ఆ అబ్బాయిని ప‌లువురు ప‌లు విధాలుగా ప్రెజెంట్ చేశార‌ని, కానీ హై మూవీలో క‌థ ప‌రంగా, ప్రెజెంటేష‌న్ ప‌రంగా ఆ పిల్లాడి క్యారెక్ట‌ర్ చాలా కీల‌క‌మని, సినిమా మొత్తానికి అది చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. ఆడియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు బుల్లిరాజును చూడ‌ని యాంగిల్ లో అత‌న్ని ఈ మూవీలో చూపించామ‌ని, అలా అని త‌న పాత్ర‌పై మ‌రీ ఓవ‌ర్ ఎగ్జైట్‌మెంట్ ఇచ్చేలా మాట్లాడ‌న‌ని సాయి కృష్ణ అన్నారు. సాయి కృష్ణ చెప్తున్న దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ మూవీతో బుల్లిరాజు మ‌రోసారి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటాడ‌ని అర్థ‌మ‌వుతుంది.