బుల్లి రాజుని చిరంజీవి బుక్ చేసారా?
`సంక్రాంతికి వస్తున్నాం`తో రేవంత్ భీమల అలియాస్ బుల్లిరాజు ఏ రేంజ్లో వైరల్ అయ్యాడో తెలిసిందే. ఓవర్ నైట్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిపోయాడు.
By: Tupaki Desk | 20 May 2025 6:00 PM IST`సంక్రాంతికి వస్తున్నాం`తో రేవంత్ భీమల అలియాస్ బుల్లిరాజు ఏ రేంజ్లో వైరల్ అయ్యాడో తెలిసిందే. ఓవర్ నైట్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిపోయాడు. సినిమాలో బుల్లి రాజు బూతు పురాణంతోనే ఇది సాధ్య మైంది. 300 కోట్ల వసూళ్లలో బుల్లి రాజు పాత్ర ఎంతో కీలకమైంది. దీంతో బుల్లి రాజుకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే చాలా సినిమాలకు సైన్ చేసినట్లు వినిపిస్తుంది. రోజుకు 50వేలు ఇచ్చిమరీ బుల్లి రాజు కోసం పోటీ పడుతున్నారని తెలిసిందే.
కొందరైతే ఒక్క రోజుకి లక్ష రూపాయలు కూడా ఆఫర్ చేస్తున్నారుట. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లిరాజును బుక్ చేసుకున్నట్లు వినిపిస్తుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కా కామెడీ ఎంటర్ టైనర్. అనీల్ స్టోరీ చెబుతున్నప్పుడే పడి పడి నవ్వినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బుల్లిరాజు కూడా సినిమాలో ఉంటే బాగుంటుందని అనీల్ ని అడి గారుట.
అందుకు అనీల్ తప్పకుండా తీసుకుందామని చెప్పారుట. చిరంజీవి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. అలాంటి హీరోకి బుల్లిరాజు తోడైతే థియేటర్లో నవ్వులు పువ్వులే. ఇద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయి. సంక్రాంతి సినిమాలో వెంకీ-బుల్లిరాజు అలా హైలైట్ అవ్వడంతోనే సినిమా గొప్ప విజయం సాధించింది. ప్రస్తుతం చిరంజీవి సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
ఇందులో హీరోయిన్ గా నయనతార ఎంపికైంంది. భారీ పారితోషికం ఇచ్చి మరీ రంగంలోకి దించారు. ఇటీవలే ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేసి రిలీజ్ చేయడంతో 157 బజ్ రెట్టింపు అయింది. హాట్ బ్యూటీతోనూ అనీల్ కామెడీ పండిచబోతున్నాడని తెలుస్తుంది.
