Begin typing your search above and press return to search.

RC16లో కూడా ఆయనే.. బుచ్చిబాబు ఎందుకిలా?

ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 March 2024 2:14 PM GMT
RC16లో కూడా ఆయనే.. బుచ్చిబాబు ఎందుకిలా?
X

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. కొత్త సినిమా RC16 లాంఛ్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ.. నిన్ననే అట్టహాసంగా ప్రారంభమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖలందరినీ తీసుకొచ్చారు బుచ్చిబాబు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్లు శంకర్, సుకుమార్ సహ నిర్మాత అల్లు అరవింద్ హాజరై విషెస్ తెలిపారు. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్.. బుచ్చిబాబుకు అరగంట సమయం ఇస్తే గంటన్నర పాటు ఏమీ ఆలోచించనివ్వకుండా నేరేషన్ కంప్లీట్ చేశారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పుడు సినీ వర్గాల్లో మరో బజ్ నడుస్తోంది. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే బుచ్చిబాబు.. సంజయ్ ను సంప్రదించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పారట. సినిమా స్టోరీ తనకు బాగా నచ్చడంతో సంజయ్ దత్ RC16లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇటీవల సంజయ్ దత్ వరుసగా దక్షిణాది సినిమాల్లో సందడి చేస్తున్నారు. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పోషించిన అధీర రోల్ కు మామూలు రెస్పాన్స్ రాలేదు. చెప్పాలంటే.. హీరో యశ్ కు విలన్‌ గా సరిగ్గా సరిపోయారు. ఇటీవల వచ్చిన లియోలో కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ తోపాటు రామ్ పోతినేని- పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ లో కూడా నటిస్తున్నారు.

ఇప్పుడు అలాంటి విలన్.. రామ్ చరణ్ తో ఫైట్ చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక RC 16 సినిమాకు విలన్ సెలక్షన్ పై నెట్టింట చర్చ జరుగుతోంది. కొందరు చరణ్ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి సంబరపడుతున్నారు. మరికొందరేమో వరుస చిత్రాల్లో ఆయనే విలన్ గా కనిపిస్తే బోర్ కొడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.