Begin typing your search above and press return to search.

RC 16: మరో స్టార్ బ్యూటీపై బుచ్చిబాబు ఫోకస్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   18 May 2024 7:30 AM GMT
RC 16: మరో స్టార్ బ్యూటీపై బుచ్చిబాబు ఫోకస్?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మరొక రెండు షెడ్యూల్స్ లో ఫినిష్ అవుతుంది. ఇక ఆ తరువాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాపై చరణ్ ఫోకస్ చేయనున్నాడు. RC 16వ ప్రాజెక్టు గా రుపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

కాంబినేషన్ తోనే ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలే బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకునే మంచి ట్రాక్లోకి వచ్చాడు. ఇక రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తూ ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్.

అలాగే ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. మొత్తానికి కాంబినేషన్ తోనే సినిమా కావలసినంత హైప్ క్రియేట్ చేసుకుంటోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయట. ప్రముఖ నటీనటులను ముఖ్యమైన పాత్రల కోసం సెలెక్ట్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే విజయ్ సేతుపతి పేరు కూడా గట్టిగానే వినిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తాడు అని కన్ఫామ్ అయ్యింది. ఇక మరొక గ్లామరస్ బ్యూటీ ని కూడా రంగంలోకి దింపేందుకు బుచ్చిబాబు ప్రణాళికలు రాసిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పుష్ప 1తో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న అమ్మడు దాని సీక్వెల్ తో మరో రేంజ్ కు వెళ్ళాలి అని ఆలోచిస్తోంది. అయితే ఇప్పుడు రాంచరణ్ 16వ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఒకసారి అమ్మడిని సంప్రదించినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పాట చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందట. అందుకే స్టార్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ క్రమంలో మొదటి ఆప్షన్ గా రష్మిక మందన్నను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె కూడా రామ్ చరణ్ తో డాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది.