Begin typing your search above and press return to search.

RC16 - సుక్కు కంటే హై లెవెల్లో స్కెచ్!

మెగా పవర్ స్టార్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:30 PM GMT
RC16 - సుక్కు కంటే హై లెవెల్లో స్కెచ్!
X

మెగా పవర్ స్టార్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గతంలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ RC16 షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలుకానుంది. డైరెక్టర్ బుచ్చిబాబు మార్చిలో ఈ సినిమాని సెట్స్ పైకి కి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.

ఇన్ని రోజులు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా? అని ఎదురుచూశాడు బుచ్చిబాబు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. మరో నెల రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేయబోతున్నారట రామ్ చరణ్. ఆ తర్వాత ఆలస్యం లేకుండా వెంటనే బుచ్చిబాబు సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు.

రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించేలా RC16 లో చరణ్ రోల్ ని డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రంగస్థలం సినిమా స్క్రిప్ట్ పనుల్లో బుచ్చిబాబు కూడా అప్పట్లో ఎక్కువగా వర్క్ చేశాడు. ఆ విషయం చరణ్, సుకుమార్ కూడా చెప్పారు. ఒక విధంగా చిట్టిబాబు క్యారెక్టర్ అంత హైలెట్ కావడానికి బుచ్చిబాబు కూడా ముఖ్య కారణం.

ఇక తన సొంత డైరెక్షన్ లో బుచ్చి, రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చుపోస్తాడో అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కూడా చరణ్ పాత్రకు లోపం ఉంటుందని ఇదివరకే టాక్ వచ్చింది. ఏమోషన్ ప్లస్ మాస్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేశాడట. ఇక రెహమాన్ ను ఏరి కోరి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు బుచ్చిబాబు

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ సేతుపతి తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.