Begin typing your search above and press return to search.

పెద్ది... ఈ స్పీడేంటి బుచ్చిబాబు

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊహించని వేగంతో జరుగుతోందని సమాచారం. ఇప్పటికే కొంత భాగం పూర్తవగా, రామ్ చరణ్ సీన్స్ కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేసేందుకు దర్శకుడు స్పెషల్ ప్లానింగ్‌తో పని చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2025 7:42 AM
పెద్ది... ఈ స్పీడేంటి బుచ్చిబాబు
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా 'పెద్ది' సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊహించని వేగంతో జరుగుతోందని సమాచారం. ఇప్పటికే కొంత భాగం పూర్తవగా, రామ్ చరణ్ సీన్స్ కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేసేందుకు దర్శకుడు స్పెషల్ ప్లానింగ్‌తో పని చేస్తున్నాడు.

ఇప్పటివరకు షూటింగ్ జరిపిన ఎపిసోడ్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సుకుమార్ తరహాలో ల్యాగ్ చేయకుండా చాలా వేగంతోనే వర్క్ చేసిన్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జులై లేదా ఆగస్టు లోపలే రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

మిగిలిన క్యారెక్టర్లు, స్పోర్ట్స్ సెక్వెన్సులు తదితరాలు డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా పూర్తి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ సిద్ధమవుతోందట. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఇప్పటికే షూట్ చేశారట. ఇందులోని ఎమోషనల్ హైపాయింట్ సినిమాకు కిక్కిచ్చే కీలక అంశంగా నిలవబోతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ సాధారణ యువకుడి నుంచి క్రికెట్ గ్రౌండ్‌లో చరిత్ర సృష్టించే ప్రయాణాన్ని చూపించేలా కథను బుచ్చిబాబు మలచినట్టు తెలుస్తోంది.

సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ కూడా ప్రత్యేకంగా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ లో బుచ్చిబాబు ఫుల్ ఫోకస్ ఎమోషనల్ కంటెంట్ పై పెట్టాడట. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో ఆ ఎమోషన్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపు మూడునెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలపై బృందం దృష్టి పెట్టనుంది.

విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్, గ్రాఫిక్స్ అన్నింటినీ పక్కాగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మ్యూజికల్ ట్రీట్ ఉండబోతోందని కూడా టాక్. ఇప్పటికే కొన్ని పాటలు కంపోజ్ అయ్యాయట. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. పల్లెటూరి యూత్ పాత్రలో చరణ్ నటన ఓ వేరే లెవెల్లో ఉండబోతోందని, ఇప్పటికే ఆయన నటించిన ఎమోషనల్ సీన్స్ బుచ్చిబాబుని సర్‌ప్రైజ్ చేశాయట.

చరణ్ డెడికేషన్ చూసి యూనిట్ అంతా ఫుల్ ఎనర్జీతో పని చేస్తున్నారట. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా 2026లో విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ది పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ స్పీడ్ చూసిన తరువాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో మెగా బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం మెగా ఫ్యాన్స్ లో మరింత పెరుగుతోంది.