బుచ్చిబాబుకు 'మెగా' క్లాస్?
కానీ మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మాత్రం అంచనాలకు తగ్గట్లు లేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
By: Tupaki Desk | 29 March 2025 12:26 PMఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా. అతడికది తొలి చిత్రం. అందులో నటించిన హీరో హీరోయిన్లు కూడా కొత్త వాళ్లు. అయినా ఆ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో బుచ్చిబాబుతో సినిమా చేయడానికి పెద్ద స్టార్లు రెడీ అయ్యారు. ముందు జూనియర్ ఎన్టీఆర్‌తో తన సినిమా ఓకే అయింది. కానీ ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు. ఐతేనేం రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమా పట్టాలెక్కింది.
ఈ సినిమా కథ గురించి విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి వాళ్లు ఒక రేంజిలో ఎలివేషన్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మాత్రం అంచనాలకు తగ్గట్లు లేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘పుష్ప’లో బన్నీ లుక్‌కు దగ్గరగా చరణ్ లుక్ కనిపించడంతో అసంతృప్తి తప్పలేదు.
‘పెద్ది’ ఫస్ట్ లుక్స్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని మెగా ఫ్యామిలీ పీఆర్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో చిరు-చరణ్ క్యాంప్ నుంచి అసంతృప్తి తప్పలేదని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజయ్యాక బుచ్చిబాబుకు ‘మెగా’ క్లాస్ తప్పలేదని సమాచారం. చిరు సైతం ఈ లుక్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఐతే సుకుమార్, చరణ్ సహా అందరికీ చూపించి వాళ్లు ఓకే అన్నాకే లుక్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు.. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని స్థితికి చేరుకున్నాడట.
ఐతే ఫస్ట్ లుక్స్ విషయంలో మిశ్రమ స్పందన నేపథ్యంలో అతను ఎక్కువ నిరాశపడకుండా టీజర్ గ్లింప్స్ మీద ఫోకస్ పెట్టాడు. 20 సెకన్ల నిడివితో ఉగాాది కానుకగా ఆదివారం సాయంత్రం ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇంతకుముందు ‘కల్కి’ ఫస్ట్ లుక్ రిలీజైనపుడు ట్రోలింగ్ జరగ్గా.. టీజర్ వచ్చాక అదంతా కొట్టుకుపోయింది. అలాగే ‘పెద్ది’ టీజర్ గ్లింప్స్ వస్తే ఇప్పుడున్న నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోతుందని బుచ్చిబాబు ధీమాగా ఉన్నట్లు సమాచారం.