Begin typing your search above and press return to search.

శిష్య‌లు కాదు...చిచ్చ‌ర పిడుగులు!

శిష్యులు గురువుల్నే మించిపోతారంటారు. మ‌రి అలాంటి శిష్యులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్ర‌ముఖంగా ఇద్ద‌రు క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2025 12:51 PM IST
శిష్య‌లు కాదు...చిచ్చ‌ర పిడుగులు!
X

శిష్యులు గురువుల్నే మించిపోతారంటారు. మ‌రి అలాంటి శిష్యులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్ర‌ముఖంగా ఇద్ద‌రు క‌నిపిస్తున్నారు. వారే బుచ్చిబాబు..అట్లీ. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని రెండ‌వ సినిమా ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోనే చేస్తున్నాడు. అదే `పెద్ది`. పాన్ ఇండియాలో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. భారీ అంచ‌నాలున్నాయి.

ఇలా రెండ‌వ సినిమానే చ‌ర‌ణ్ తో అంటే అత‌డు స‌క్సెస్ అక్క‌డే క‌నిపిస్తుంది. ఎన్నో సినిమాల‌కు సుకు మార్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసాడు. ఆయ‌న వ‌ద్ద చాలా మంది శిష్యులున్నా? ప్రియు శిష్యుడు మాత్రం బుచ్చిబాబే. గురువు కూడా స‌హ‌క‌రించ‌డంతో ఇండ‌స్ట్రీలో వేగంగా ఎదుగుతున్నాడు. `పెద్ది` హిట్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియాలో నిల‌బ‌డ‌తాడు. ఆ త‌ర్వాత అత‌డి సినిమాల‌న్నీ స్టార్ హీరోల‌తో పాన్ ఇండియా చిత్రాలే ఉంటాయి.

అలాగే అట్లీ ....స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ శిష్యుడు. శిష్య‌రికం చేసే స‌మ‌యంలో శంక‌ర్ కి అంత క్లోజ్ కాదు. కానీ ఆయ‌న వ‌ద్ద చాలా సినిమాల‌కు ప‌నిచేసాడు. అత‌డి వ‌ద్ద ప‌ని తెలుసుకుని డైరెక్ట‌ర్ గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి `రాజా రాణి` అనే సినిమా చేసాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత `తేరి`, `మెర్సిల్`, `బిగిల్` , `జ‌వాన్` ఇలా అన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లే. `జ‌వాన్` ఏకంగా 1400 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

దీంతో పాన్ ఇండియాలో అత‌డి సంచ‌ల‌నంగా మారింది. ఆ స‌క్సెస్ ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం తెచ్చి పెట్టింది. ఈ సినిమా త‌ర్వాత అట్లీ గురువునే మించిపోతాడా? అన్న క‌థ‌నాలు అప్పుడే ఊపందుకున్నాయి.