Begin typing your search above and press return to search.

రాజమౌళి ఆవిష్కరించిన కనకాల 'బబుల్‌గమ్‌'

రాజమౌళి విడుదల చేసిన పోస్టర్‌ లో అక్టోబర్ 10న సినిమా నుంచి గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 3:48 AM GMT
రాజమౌళి ఆవిష్కరించిన కనకాల బబుల్‌గమ్‌
X

సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ ని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రేక్షకులకు పరిచయం చేశాడు.


హీరోయిన్‌ తో కలిసి ఉన్న రోషన్ కనకాల పోస్టర్ ని విడుదల చేశారు. ఇక ఈ సినిమాకి విభిన్నంగా 'బబుల్ గమ్‌' అనే టైటిల్ ని ఖరారు చేశారు. రోషన్‌ బబుల్‌ గమ్‌ ఊదుతూ హీరోయిన్‌ కి క్లోజ్ గా ఉన్న పోస్టర్‌ ని విడుదల చేయడం ద్వారా సినిమాకి బబుల్‌ గమ్‌ కి ఏదో లింక్ ఉన్నట్టు దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

రాజమౌళి విడుదల చేసిన పోస్టర్‌ లో అక్టోబర్ 10న సినిమా నుంచి గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రోషన్ కనకాల కి జోడీగా మానస హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరి జోడీ ఈ పోస్ట్‌ లో కన్నుల విందు అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

యాంకర్‌ గా సుమ, నటుడిగా రాజీవ్ కనకాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ సెలబ్రెటీలు. బబుల్ గమ్ సినిమా తో రోషన్‌ మినిమం సక్సెస్‌ ని దక్కించుకున్నా కూడా ముందు ముందు పెద్ద సినిమాల్లో.. పెద్ద బ్యానర్‌ ల్లో నటించే అవకాశాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

రోషన్‌ హీరోగా పెద్ద దర్శకులతో సినిమాలు సెట్‌ చేయగల సత్తా సుమ మరియు రాజీవ్ కనకాలకు ఉంది. కనుక రోషన్‌ కెరీర్‌ ఎలా ఉంటుందో బబుల్ గమ్‌ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మొదటి సినిమా మొదటి పోస్టర్‌ ని టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించుకున్న రోషన్‌ అదృష్టవంతుడు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.