Begin typing your search above and press return to search.

యాంకర్ సుమ కొడుకు సినిమా.. సెన్సార్ షాక్

తెలుగు యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల ఏకైక కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Dec 2023 9:24 AM GMT
యాంకర్ సుమ కొడుకు సినిమా.. సెన్సార్ షాక్
X

తెలుగు యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల ఏకైక కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కొడుకు డెబ్యూ మూవీ కోసం ఎన్నో కథలు విన్న రాజీవ్, సుమలు చివరకు బబుల్ గమ్ స్టోరీకి ఓకే చెప్పారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా రోషన్ కనకాల మూవీ బబుల్ గేమ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంటే పెద్దలకు మాత్రమే అన్న మాట. ఇదొక జెన్జీ లవ్ స్టోరీ అని దర్శక నిర్మాతలు, చిత్రబృందం ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే హీరో హీరోయిన్ల మధ్య తెగ ముద్దులు ఉన్నాయి.

సినిమా స్టోరీ లైన్ ఇదే!

లైఫ్ లో ఫుల్ జోష్తో హ్యాపీ గా ఉండే హీరో (రోషన్ కనకాల) పార్టీల్లో డీజే వాయిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకు తగ్గట్లే ఉంటాడు. అదే సమయంలో హీరోకు మంచి రిచ్ ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ (మానస చౌదరీ) పరిచయమవుతోంది. అతడి లైఫ్ ను ఒక్కసారిగా మార్చేస్తోంది.

కానీ ఆమె ఫ్యాషన్ కమ్ మోడ్రన్ లైఫ్ కు సెట్ కానీ హీరో దూరమవుతాడు. అదే టైమ్ లో మరో యువకుడు జానుకు దగ్గరయ్యేందుకు ట్రై చేస్తాడు. తన జీవితంలో పరువు అనే టాపిక్ చాలా స్ట్రాంగ్ ఉండడంతో పోయిన ప్రేమను అడ్డుగా వచ్చే వారిని ఎలా ఎదిరించాడో అదే సినిమా.

రోషన్ కనకాల, మానస చౌదరీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీఎస్వీ గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేశ్ రగుతు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. అయితే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను యువత తెగ చూసేసింది. ఆ సినిమా విజయాలకు ఎలాంటి ముద్దులు అడ్డు కాలేదు. ఇక రోషన్ తొలి సినిమా కూడా విజయం సాధించి ఆ సినిమాల జాబితాలో చేరుతుందో లేదో చూద్దాం.