Begin typing your search above and press return to search.

'బబుల్ గమ్'.. ఎర్లీ ప్రీమియర్స్ వర్కౌట్ అయ్యేనా?

ఆ చిన్న సినిమా పేరే 'బబుల్ గమ్'. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఈ సినిమాతో హీరోగా వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 11:34 AM GMT
బబుల్ గమ్.. ఎర్లీ ప్రీమియర్స్ వర్కౌట్ అయ్యేనా?
X

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సలార్' సెన్సేషన్ కొనసాగుతోంది. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం విడుదలై ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన అందుకుంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో ఓ చిన్న సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

ఆ చిన్న సినిమా పేరే 'బబుల్ గమ్'. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఈ సినిమాతో హీరోగా వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

అయితే ప్రెజెంట్ సలార్ మ్యానియాలో ఉన్న ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు బబుల్ గమ్ మూవీ టీం పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేసింది. ఈమధ్య టాలీవుడ్లో రిలీజ్ కి ముందే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు స్పెషల్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ అంటూ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయాయి. అయితే ఈసారి బబుల్ గమ్ మూవీ టీం రిలీజ్ కు ఒక్క రోజు ముందు స్పెషల్ ప్రీమియర్ ని ప్లాన్ చేశారు.

టీమ్ అంతా సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సలార్ వంటి స్టార్ హీరో సినిమా ఉన్నా కూడా బబుల్ గమ్ మూవీని రిలీజ్ చేస్తుండటం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాని డిసెంబర్ 29న విడుదల చేస్తున్నారు. దీనికంటే ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 28న హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో బబుల్ గమ్ పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ పెయిడ్ ప్రీవియస్ కోసం అప్పుడే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ పెయిడ్ ప్రీమియర్స్ కి కనుక పాజిటివ్ టాక్ వస్తే బబుల్ గమ్ రూపంలో సుమ కనకాల కొడుకు రోషన్ కి డెబ్యూ హీరోగా మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. రోషన్ కనకాల సరసన మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించారు.