Begin typing your search above and press return to search.

బి టౌన్‌ స్టార్ హీరోయిన్ గాలి ఇటు మల్లిందేం...?

మణికర్ణిక సినిమా తర్వాత ఇప్పటి వరకు మినిమం పర్వాలేదు అనిపించుకున్న సినిమా ఆమె నుంచి రాలేదు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 7:01 AM GMT
బి టౌన్‌ స్టార్ హీరోయిన్ గాలి ఇటు మల్లిందేం...?
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ కి గత కొంత కాలంగా బ్యాడ్‌ టైమ్ నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆమె చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. మణికర్ణిక సినిమా తర్వాత ఇప్పటి వరకు మినిమం పర్వాలేదు అనిపించుకున్న సినిమా ఆమె నుంచి రాలేదు.

కంగనా నటించిన దాదాపు అర డజను సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం మాత్రమే కాకుండా ఆమె మార్కెట్‌ ను కూడా తగ్గించాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌ లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఇప్పుడు మాత్రం ఆమె గురించి అక్కడి ఫిల్మ్‌ మేకర్స్ మరియు ప్రేక్షకులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

అసలే వరుస ఫ్లాప్స్‌, ఆపై అన్ని వివాదాలే... అందుకే బాలీవుడ్‌ లో కంగనా కి ఆఫర్లు దక్కడం లేదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఆమె సౌత్‌ పై దృష్టి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు సౌత్‌ సినిమాలను కంగనా చిన్న చూపు చూసినట్లుగా కామెంట్స చేసిన సందర్భాలను కొందరు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

చంద్రముఖి 2 సినిమా తర్వాత కంగనా మరో తమిళ సినిమాకు కమిట్ అయింది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా లు పాన్ ఇండియా మార్కెట్‌ ను కలిగి ఉంటున్నాయి. కనుక ఇక్కడ చేస్తున్నాను అంటూ కంగనా చెప్పవచ్చు. కానీ చాలా మంది మాత్రం ఆమెకు అక్కడ ఆఫర్లు లేకపోవడం వల్లే ఇక్కడ చేసేందుకు ఓకే చెబుతోందని అంటున్నారు.

ఇక కంగనా తాజాగా ఓకే చెప్పిన తమిళ సినిమా విషయానికి వస్తే... గతంలో ఏఎల్‌ విజయ్ దర్శకత్వంలో కంగనా తలైవి సినిమాను చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడిందే లేదు. అయినా కూడా మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మరో సినిమాకు కంగనా ఓకే చెప్పింది. త్వరలో ప్రారంభం కాబోతుంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.