భయం వెంటాడుతుందంటున్న అనుపమ
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 25 April 2025 3:00 PM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం భైరవం, టైసన్ నాయుడు సినిమాలతో పాటూ మరో సినిమా కూడా శ్రీనివాస్ చేతిలో ఉంది. వాటిలో భైరవం మరియు టైసన్ నాయుడు సినిమాలు ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయి. ఈ రెండూ కాకుండా శ్రీనివాస్ కెరీర్లో 11వ సినిమాగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
కౌశిక్ పగళ్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి రాక్షసుడు అనే హర్రర్ థ్రిల్లర్ లో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మరో సినిమా తెరకెక్కింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
2019లో సైకో కిల్లర్ ను వెంబడించిన ఈ జంట ఇప్పుడు మరోసారి ఓ హార్రర్ మిస్టరీలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గురించి మేకర్స్ ఇప్పుడు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 27న #BSS11 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. ప్రీ లుక్ తోనే మేకర్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగలిగారు.
ఈ ప్రీ లుక్ పోస్టర్ లో సువర్ణమాయ అని ఓ రేడియో ఆఫీస్ ముందు ఓ వ్యాన్ తగలబడిపోతూ కనిపించింది. పోస్టర్ లో ఎఫ్ఎమ్919 దగ్గర పాయింట్ బార్ కనిపిస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. అనుపమ ఆ పోస్ట్ ను షేర్ చేస్తూ మిమ్మల్ని ఓ భయంకరమైన విషయం వెంటాడుతోందని రాసుకొచ్చింది. ప్రీ లుక్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ మూవీ కోసం సామ్ సి ఎస్ తో పాటూ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి భారీ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించనున్నారు.
