Begin typing your search above and press return to search.

చిన్న దేవరకొండ కోసం రంగంలోకి రష్మిక

తాజాగా బృందావనమే అంటూ సాంగే లెరికల్ సాంగ్ ని విడుదల చేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఈ సాంగ్ ని లాంచ్ చేయడం విశేషం.

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:15 AM GMT
చిన్న దేవరకొండ కోసం రంగంలోకి రష్మిక
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటుడిగా తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. యాక్షన్ అండ్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఆనంద్ దేవరకొండకి జోడీగా ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక నటిస్తున్నారు.ఉదయ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా బృందావనమే అంటూ సాంగే లెరికల్ సాంగ్ ని విడుదల చేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఈ సాంగ్ ని లాంచ్ చేయడం విశేషం.

సాంగ్ లాంగ్ చేసి ఆనంద్ దేవరకొండతో పాటు టీం మొత్తానికి విశేష్ చెప్పింది. ఫీల్ గుడ్ మెలోడియస్ గా సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించడం విశేషం. వెంగి సుధాకర్ ఈ సాంగ్ కి లెరిక్స్ రాశారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించడంతో పాటు సిద్ శ్రీరామ్ తో కలిసి పాడారు. హీరోయిన్ లవ్ యాక్సప్ట్ చేయడంతో పాటు ఆమె గురించి ఆలోచించుకుండా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సాంగ్ వస్తోంది.

సిద్ శ్రీ రామ్ నుంచి వస్తోన్న పాట అంటే కచ్చితంగా ఈ జెనరేషన్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయిపోతుంది. ఆయన పాడిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ పాట కూడా పెద్ద హిట్ అయ్యేలా ఉంది. మెలోడీ ట్యూన్స్ తో ఆహ్లాదంగా ఉండటంతో సంగీతప్రియులకి బృందావనమే సాంగ్ చేరువ అయ్యే ఛాన్స్ ఉంది.

బేబీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దేవరకొండ గంగం గణేశా చిత్రంతో సోలోగా సూపర్ హిట్ సొంతం చేసుకొని హీరోగా తన ఇమేజ్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో తనలోని కామెడీ యాంగిల్ ని కూడా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే అది టీజర్ లో కనిపించింది. మరి ఈ మూవీ మేరకు సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.