Begin typing your search above and press return to search.

అంద‌మైన భామ‌ల మ‌ధ్య న‌లిగిపోయిన బ్ర‌ద‌ర్స్!

ఈ సంద‌ర్భంగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌ర్నీ బాలీవుడ్ భామ‌లంతా చుట్టుముట్టేసారు. ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి దూరి సెల్పీలు దిగ‌డం..ఫోటో సెష‌ల్ పాల్గొన‌డం ఆ ర‌చ్చంతా మామూలుగా లేదు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 3:15 AM GMT
అంద‌మైన భామ‌ల మ‌ధ్య న‌లిగిపోయిన బ్ర‌ద‌ర్స్!
X

లైవ్ కాన్సెర్ట్ లో భాగంగా జోనాస్ బ్రదర్స్ నిక్ జోనాస్, జో జోనాస్, కెవిన్ జోనాస్ ఇటీవల భార‌త్ కి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు దిగ్విజ‌యంగా ఆ ఈవెంట్ ని ముగించారు. అయితే ఈ స‌మ‌యంలో వాళ్ల‌తో పాటు నిక్ జోనాస్ భార్య‌..న‌టి ప్రియాంక చోప్రా మాత్రం రాలేదు. అయితే ఇక్క‌డ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ మాత్రం కావాల్సిన అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసింది. పీసీ లేక‌పోయినా ఆమె లేని లోటు ఎక్క‌డా క‌నిపించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంది.

ఎయిర్ పోర్ట్ లో దిగిన ద‌గ్గ‌ర నుంచి క‌చేరీ పూర్త‌య్యేవ‌ర‌కూ పీసీ స్నేహితులు...ఆర్గ‌నైజ‌నర్లు అంతా ద‌గ్గ‌రుండి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూసుకున్నారు. పీసీ వాళ్ల ద‌గ్గ‌ర లేక‌పోయినా ఉన్నాను అనే ఫీలింగ్ తెచ్చేలా చేసింది. ఇక క‌చేరి అనంత‌రం అన్న‌ద‌మ్ములిద్ద‌రికి స‌త్కార కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌డం.. ప‌లువురు సెల‌బ్రిటీలు ముంబైలో గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌ర్నీ బాలీవుడ్ భామ‌లంతా చుట్టుముట్టేసారు. ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి దూరి సెల్పీలు దిగ‌డం..ఫోటో సెష‌ల్ పాల్గొన‌డం ఆ ర‌చ్చంతా మామూలుగా లేదు. కావాల్సినంత స‌మ‌యం ఉండటం ..అందులోనూ పార్టీ స‌మ‌యం కావ‌డంతో జోనాస్ బ్ర‌ద‌ర్స్ భామ‌ల మ‌ధ్య‌లో అంతే ఉత్సాహంతో పాల్గొన్నారు. భూమి పెడ్నేకర్- సుస్సానే ఖాన్- మలైకా అరోరా త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాళ్లంతా నిక్ బ్ర‌ద‌ర్స్ తో ఎంతో స్వేచ్ఛ‌గా పార్టీని ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. భూమీ ప‌డ్నేకర్..మ‌లైకా అరోరా నిక్ ని హ‌త్తుకుని మ‌రీ ఫోటోలు దిగారు. అలాగే అదితి రావ్ హైదరీ ..నితాషా నందా ..సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజా.. మాధురీ దీక్షిత్ ఎంతో అందంగా ముస్తాబై పార్టీకి హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.నిక్ ని ఇలా చుట్టు ముట్ట‌డంపై సొగ‌సైన కామెంట్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. పీసీ ఇలా హ‌బ్బీని ఒంట‌రిగా ఇండియాకి పంపిస్తే ఇలాగే ఉంటుంది. ఈసారి త‌ప్ప‌కుండా పీసీ నిక్ ప‌క్క‌న లేక‌పోతే చాలా ప్ర‌మాదాలే జ‌రిగిపోతాయంటూ నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు.