Begin typing your search above and press return to search.

అన్న‌ద‌మ్ముల‌తో అన్న‌పూర్ణ బ్యాక్ టూ బ్యాక్!

మా సంస్థ‌లో త‌దుప‌రి చైత‌న్య‌..అఖిల్ తో వ‌రుస‌గా సినిమాలుంటాయి. అవి ఎన్నైనా ఉండొచ్చు' అని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:04 AM GMT
అన్న‌ద‌మ్ముల‌తో అన్న‌పూర్ణ బ్యాక్ టూ బ్యాక్!
X

అక్కినేని వార‌సులుగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైత‌న్య‌..అఖిల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నాగ చైత‌న్య ఇప్ప‌టికే ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుని ముందుకెళ్తున్నాడు. ఇక అన్న‌య్య దారిలోనే అఖిల్ జ‌ర్నీ కూడా సాగుతుంది. కానీ యంగ్ హీరో ఇంకా త‌న బ్రాండ్ ని బ‌లంగా వేయ‌లేదు. ఆ దిశ‌గా సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఇప్ప‌టికే సొంత నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనూ ఇద్ద‌రు హీరోలు కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా బ‌య‌ట బ్యాన‌ర్లోనే సినిమాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్న‌ద‌మ్ములిద్ద‌రితో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు. ప్ర‌స్తుతం ఛాయ్ బిస్కెట్ సంస్థ‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియో ఓ క‌న్న‌డ సినిమాని తెలుగులో 'బాయ్స్ హాస్ట‌ల్' టైటిల్ తో అనువ‌దిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాణ సంస్థ‌ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ' సినిమా నిర్మాణంలో మేమేం మార‌లేదు. ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాలు తీసే విధానంలో మార్పులొచ్చాయి. ఒక టీమ్ ఒక సినిమా చేయ‌గ‌ల్గుతుంది. అందుకే ప‌లు నిర్మాణ సంస్థ‌లు క‌లిసి ప‌నిచేస్తున్నాయి. క‌థ‌లు లేక కాదు..ఆ క‌థ‌తో చివ‌రి వ‌ర‌కూ ప్ర‌యాణం చేయ‌డం కీల‌కం.

నాగార్జున మావ‌య్య కంటే మంచి నిర్మాత ఎవ‌రూ లేరు. 'సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారండి' నుంచి అలాంటి అద్భుతాలు చాలానే చేసారు. మా సంస్థ‌లో త‌దుప‌రి చైత‌న్య‌..అఖిల్ తో వ‌రుస‌గా సినిమాలుంటాయి. అవి ఎన్నైనా ఉండొచ్చు' అని అన్నారు. అయితే ఆ సినిమాల ద‌ర్శ‌కుల పేర్లు మాత్రం రివీల్ చేయ‌లేదు.