Begin typing your search above and press return to search.

శ్యామ్ బాబు బజ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!

ఇక ముఖ్యంగా మై డియర్ మార్కండేయ పాటలోనే శ్యామ్ బాబు పాత్ర హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 5:18 PM GMT
శ్యామ్ బాబు బజ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!
X

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ అందుకుంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన టైమ్ రోల్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. జెట్ స్పీడ్ లో ఫినిష్ అయిన ఈ సినిమా షూట్ తో మెగా హీరోలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక సినిమా పొలిటికల్ గా ఈ స్థాయిలో కాంట్రావర్సీ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ వైసిపి మంత్రి అంబటి రాంబాబు అందులో శ్యామ్ బాబు అనే పాత్రను తనపై సెటైర్ లు వేసేలా క్రియేట్ చేశారు అని ఆరోపించారు. ఇక ఆ వివాదం ప్రెస్ మీట్ నుంచి ఢిల్లీ వరకు వెళ్లింది. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో సున్నితంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక ముఖ్యంగా మై డియర్ మార్కండేయ పాటలోనే శ్యామ్ బాబు పాత్ర హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు.

సినిమాలో ఎలా ఉందో ఫుల్ వీడియో సాంగ్ లో కూడా అదే తరహాలో ఉంచారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక పొలిటికల్ గా మళ్ళీ ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అయితే ఎవరు స్పందించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.

ఇక బ్రో సినిమా కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఓ వర్గం ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.

ఇక సినిమా జూలై 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక బాక్సాఫీస్ వద్ద 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక సినిమా ఓటీటీ డేట్ కోసం కుడావు వర్గం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక బ్రో సినిమా ఓటీటీ హక్కులు అయితే అమెజాన్ ప్రైమ్, జీ 5 సొంతం చేసుకున్నాయి. రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26వ తేదీన అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.