Begin typing your search above and press return to search.

'బ్రో' కి అవే పెద్ద హైలైట్

పవన్‌ కళ్యాణ్ చెప్పే ఎమోషనల్‌ డైలాగ్స్

By:  Tupaki Desk   |   20 July 2023 4:33 AM GMT
బ్రో కి అవే పెద్ద హైలైట్
X

పవన్ కళ్యాణ్‌.. సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన 'బ్రో' సినిమా విడుదలకు సిద్ధం అయింది. తమిళ సూపర్ హిట్ మూవీ 'వినోదయ్య సీతమ్‌' కి రీమేక్ గా రూపొందిన బ్రో సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా రచన వ్యవహారాలను త్రివిక్రమ్‌ చూసుకున్నారు.

వినోదయ్య సీతమ్ స్క్రిప్ట్‌ ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా.. పవన్ కళ్యాణ్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చడంలో త్రివిక్రమ్‌ కీలక పాత్ర పోషించారట. అదే సమయంలో ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్‌ పోర్షన్‌ సన్నివేశాలన్నింటికి కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ రాయడంతో పాటు స్క్రీన్‌ ప్లే ను పర్యవేక్షించాడని సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్ చెప్పే ఎమోషనల్‌ డైలాగ్స్.. నైతిక విలువలకు సంబంధించిన డైలాగ్స్ మాత్రమే కాకుండా పొలిటికల్‌ పంచ్ డైలాగ్స్ అన్ని కూడా సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నట్లుగా యూనిట్ సభ్యులు బలంగా చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ సన్నివేశాల్లో డైలాగ్స్ మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయట.

మొత్తానికి బ్రో సినిమా లో పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్‌ చెప్పించిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాయట. అంతే కాకుండా త్రివిక్రమ్‌ మార్క్‌ స్క్రీన్‌ ప్లే 'బ్రో' సినిమా స్థాయిని పెంచడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్ తో పాటు మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

పవన్ గత రీమేక్ చిత్రం భీమ్లా నాయక్‌ విషయంలో కూడా త్రివిక్రమ్‌ పూర్తిగా రచన వ్యవహారాలు చూసుకున్నాడు. అంతే కాకుండా స్క్రీన్‌ ప్లే విషయంలో కూడా చాలా శ్రద్ద కనబర్చాడు. అందుకే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో త్రివిక్రమ్‌ కి క్రెడిట్ దక్కింది. అందుకే బ్రో సినిమా కూడా అదే తరహా లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.