Begin typing your search above and press return to search.

'కీడా కోలా'.. బ్రహ్మి రోల్ ఆయన చేసుంటే..

ఈ క్రమంలోనే ఆయన అల్లు అరవింద్ గురించి ఓ విషయాన్ని రివీల్​ చేశారు. అదేంటంటే తన సినిమాలో మొదట బ్రహ్మానందం పాత్ర కోసం అరవింద్​ను అనుకున్నట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:27 AM GMT
కీడా కోలా.. బ్రహ్మి రోల్ ఆయన చేసుంటే..
X

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యూత్​ను అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. చాలా గ్యాప్​ ఇచ్చి ఇప్పుడు 'కీడా కోలా'తో రాబోతున్నారు. క్రైం కామెడీ థ్రిల్లర్​గా రాబోతున్న ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమా విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అలా చేయకుండా ఉండాల్సింది అని అంతా మాట్లాడుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?... ప్రస్తుతం తరుణ్ భాస్కర్​ ఈ కీడా కోలా సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అల్లు అరవింద్ గురించి ఓ విషయాన్ని రివీల్​ చేశారు. అదేంటంటే తన సినిమాలో మొదట బ్రహ్మానందం పాత్ర కోసం అరవింద్​ను అనుకున్నట్లు చెప్పారు. కానీ ఆయన నో చెప్పడంతో బ్రహ్మీని అప్రోచ్ అయినట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రియులు.. అల్లు అరవింద్​ నో చెప్పకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్​ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా సార్లు స్టేజ్​పై ఆయన తన మాటలతో నవ్విస్తుంటారు. చాలా ఏళ్ల క్రితమే చంటబ్బాయి చిత్రంలో ఆయన చేసిన పాత్ర కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కాబట్టి ఆయన మళ్లీ ఈ చిత్రం కోసం నటించి ఉంటే పక్కా ఆయన పాత్ర ఎంతో కొత్తగా, ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేది.

ఎలాగో బ్రహ్మీ అలాంటి పాత్రలు చేసి చేసి ఆడియెన్స్ అలవాటు పడిపోయారు. కాబట్టి అల్లు అరవింద్ చేసి ఉంటే.. తరుణ్ భాస్కర్​ ఆయన్ను మరింత కొత్తగా ప్రజెంట్​ చేసేవారు. పైగా నిర్మాతలు ఇలా సినిమాల్లో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇదంతా సినీ ప్రియులకు ఓ ప్రత్యేకంలా ఉండేది. సినిమాకు మరింత హైప్ కూడా క్రియేట్ అయ్యేది. కాబట్టి ఈ మెగా ప్రొడ్యూసర్​ అయ్యో అనవసరంగా ఈ ఛాన్స్​ను వదిలేశారే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.