Begin typing your search above and press return to search.

అదీ బ్రహ్మాజీ అంటే.. కొడుకు కోసం ఇండస్ట్రీనే ఎత్తుకొచ్చేశాడు..

ఇండస్ట్రీలో తనకున్న కాంటాక్ట్ ను వినియోగించుకుని ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 July 2023 12:22 PM GMT
అదీ బ్రహ్మాజీ అంటే.. కొడుకు కోసం ఇండస్ట్రీనే ఎత్తుకొచ్చేశాడు..
X

సాధారణంగా బడా హీరోల సినిమాలంటే చిన్న చిత్రాలు రిలీజ్ కు రెడీ అవ్వవు. కానీ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరో గా 'స్లమ్ డాగ్ హస్బెండ్' చిత్రం మాత్రం విడుదల కు సిద్ధమైంది. మరో రోజులో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. అయితే ఈ చిత్ర బాధ్యతలను పూర్తిగా తన పై వేసుకున్నాడు బ్రహ్మాజీ.

సినిమా ను ఎలాగైనా ఆడియెన్స్ కు చేరువ చేయాల ని విశ్వప్రయత్నాలు చేస్తన్నాడు. ఇండస్ట్రీలో తనకున్న కాంటాక్ట్ ను వినియోగించుకుని ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు. వారి చేత సినిమా కంటెంట్ బాగుందని చెప్పిస్తూ మూవీ పై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాడు. అలాగే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ చేత వీడియో బైట్ కమిట్ మెంట్, ట్రైలర్ పై అల్లు అర్జున్, ఫాహద్ ఫజల్ ప్రశంసలు, రామ్ గోపాల్ వర్మ కుక్క మొగుడు టైటిల్ అడ్వైస్, ప్రచార చిత్రం లో అనిల్ రావిపూడి చేయూత, నాగార్జున, ప్రదీప్, అలీ వంటి సెలబ్రిటీలతో ప్రమోషన్స్.. ఇలా దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. సినిమా పై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ను తీసుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైలైట్ గా నిలిపాడు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల ను కూడా తీసుకొచ్చాడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ, దర్శకుడు బాబీ, దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈవెంట్ కు హాజరై సినిమా ను గట్టిగా ప్రమోట్ చేశారు.

శ్రీలీల మాట్లాడుతూ... "భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లో ఈ ఈవెంట్ గురించి తెలిసింది. ఇండస్ట్రీకి రావడం బోల్డ్ స్టెప్. కానీ ఇక్కడ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తన్నారు. మన బౌండరీస్ సెట్ చేసుకుంటే మనల్ని ఆపేవాళ్లు ఉండరు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల ని కోరుకుంటున్నాను. సినిమా టీమ్ కు మరోసారి ఆల్ ది బెస్ట్." అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

విరూపాక్ష దర్శకుడు మాట్లాడుతూ .. "బ్రహ్మాజీగారు. ఆయన ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అలాగే సంజయ్ రావు ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అనగా.. దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "నా కెరీర్ ప్రారంభం లో నాకు మద్దతుగా నిలిచిన వ్యక్తి బ్రహ్మాజీ. అలాంటిది ఆయన కొడుకు హీరోగా చేసిన ఈ సినిమా తప్పకుండా హిట్ సాధించాల ని కోరుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ప్రణవి, హీరోయిన్ గా పరిచయమవ్వడం ఆనందంగా ఉంది" అని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. "ఈ సినిమా లో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఉండటం ఆనందంగా ఉంది. నా కొత్త సినిమా కోసం తెలుగు అమ్మాయినే తీసుకోవాలని చూస్తున్నాను" అని అన్నారు.

ఇక బ్రహ్మాజీ మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ స్టార్ గెస్ట్ రావాలని భావించాను. శ్రీలీల ను అడిగితే 'నేను చేసింది రెండు సినిమాలే సార్ .. నేను చీఫ్ గెస్టు ఏంటి .. బాగుండదేమో' అంది. ఆమెకి ఉన్న క్రేజ్ గురించి చెబితే అప్పుడు ఒప్పుకుంది. అందుకు ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.