Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం ఫ్లాప్ గురించి మహేష్‌ ఏమన్నాడంటే..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:20 AM GMT
బ్రహ్మోత్సవం ఫ్లాప్ గురించి మహేష్‌ ఏమన్నాడంటే..!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మలితరం మల్టీస్టారర్ సినిమాలకు ఆజ్యం పోసినట్లుగా నిలుస్తుంది. అలాంటి సినిమా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల అదే మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం అనే డిజాస్టర్ ని ఇచ్చాడు.

మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌ తో కనీసం కథ కూడా లేని సినిమా తీసిన ఘనత శ్రీకాంత్ అడ్డాలకి దక్కిందని కొందరు విమర్శిస్తే మరి కొందరు ఎలా ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల కమిట్ అయ్యాడు అంటూ ప్రశ్నించిన వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి బ్రహ్మోత్సవం మహేష్ బాబు అభిమానులకు ఒక పీడ కల అన్నట్లుగా మిగిలింది.

చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మోత్సవం దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల పెద్దకాపు 1 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. పెద్దకాపు సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీకాంత్‌ అడ్డాల మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బ్రహ్మోత్సవం సినిమా ఫలితం తర్వాత మహేష్ బాబు గారితో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో ఆయన నాతో... మనం బాగానే ఉన్నాం కదా, కొన్న సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ధైర్యంగా ఉండాలని అన్నారు. మహేష్ బాబు గారి మాటలు నాకు చాలా ధైర్యం ను ఇచ్చాయి. ఆయనతో మళ్లీ సినిమా చేస్తానని అన్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సీక్వెల్‌ ను చేద్దాం అన్నట్లుగా మహేష్ బాబు అన్నారు. దిల్ రాజు గారు సీక్వెల్‌ ని నిర్మించేందుకు ఓకే చెప్పారు. తప్పకుండా ముందు ముందు మా కాంబోలో ఆ సినిమా ఉంటుందనే నమ్మకంను శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నాడు. పెద్ద కాపు సక్సెస్ అయితేనే శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాకు ఛాన్స్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.