Begin typing your search above and press return to search.

సీక్వెల్‌ షూటింగ్ పూర్తి... అయినా విడుదల అనుమానమే!

ఎంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు అయినా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి

By:  Tupaki Desk   |   2 Aug 2023 11:06 AM GMT
సీక్వెల్‌ షూటింగ్ పూర్తి... అయినా విడుదల అనుమానమే!
X

బాలీవుడ్‌ లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు అయినా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అదృష్టం బాగుండి ఏదో ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి కానీ చాలా సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు సాధించడమే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి సమయంలో బ్రహ్మాస్త్ర సినిమాను విడుదల చేస్తే కచ్చితంగా నష్టం తప్పదు అని కరణ్‌ జోహార్‌ భావిస్తున్నాడని.. అందుకే ఆయన ఓటీటీ స్ట్రీమింగ్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మాస్త్ర సినిమాకు దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు వచ్చాయి అంటూ ప్రచారం చేశారు. కానీ అందులో ఎంత నిజమో క్లారిటీ లేదు. ఇన్‌ సైడ్ టాక్ ప్రకారం బ్రహ్మాస్త్ర సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు మిగిల్చిందట. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 ను కూడా వారికే ఇస్తే నిర్మాతలకు పెద్ద నష్టం తప్పదు. అందుకే థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్‌ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బ్రహ్మాస్త్ర 2 సినిమా ను ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. షూటింగ్‌ గతంలోనే పూర్తి అయ్యింది. ఫస్ట్‌ కాపీ కూడా రెడీగా ఉంది. అయినా కూడా విడుదల అవ్వడం అనుమానమే అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.