Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మానందం ఇంట బ‌న్నీ ఎందుకో తెలుసా?

తాజాగా కొద్ది సేప‌టి క్రితం బ‌న్నీ..హాస్యబ్ర‌హ్మ ఇంటికెళ్లారు. దాదాపు గంట‌న్న‌ర పాటు బ్ర‌హ్మ‌నందం కుటుంబంతో బ‌న్నీ గ‌డిపారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 1:00 PM GMT
బ్ర‌హ్మానందం ఇంట బ‌న్నీ ఎందుకో తెలుసా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి నుంచి అల్లు ఫ్యామిలీ అంతా అదే ఆనందంలో ఉంది. సోష‌ల్ మీడియాలో విషెస్ అభిమానులు..కుటుంబ స‌భ్యుల విషెస్ తో బ‌న్నీ త‌డిసి ముద్ద‌వుతున్నారు. సీనీ రాజ‌కీయ ప్ర‌ముఖులంతా విషెస్ తెలియ‌జేసారు. అల్లు ఫ్యామిలీకి బాగా సన్నిహితంగా ఉండేవారంతో నేరుగా బ‌న్నీ ఇంటికొచ్చి అభినంద‌న‌లు చెబుతున్నారు. ఇలా ఇంత బిజీగా ఉన్నా బ‌న్నీ మాత్రం తాను పూర్తి చేయాల్సిన ప‌నులు మాత్రం మ‌ర్చిపోలేదు.

తాజాగా కొద్ది సేప‌టి క్రితం బ‌న్నీ..హాస్యబ్ర‌హ్మ ఇంటికెళ్లారు. దాదాపు గంట‌న్న‌ర పాటు బ్ర‌హ్మ‌నందం కుటుంబంతో బ‌న్నీ గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా హాస్య‌బ్ర‌హ్మ ఇంట స‌న్మానం అందుకున్నారు. బ‌న్నీని బ్ర‌హ్మానందం మెడ‌లో పూల దండ వేసి..పుష్ప‌గుచ్చం అందించి అభినంద‌న‌లు తెలియ‌జేసార‌ను.

ఈ సంద‌ర్భంగా బ‌న్నీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మ‌రి బ‌న్నీ ..బ్ర‌హ్మానందం ఇంటికెళ్ల‌డం వెనుక అస‌లు సంగతేంటి? అంటే ఇటీవ‌లే బ్రహ్మానందం రెండ‌వ కుమారుడి వివాహం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఆ వేడుక‌కు టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా హాజ‌ర‌య్యారు. కానీ బ‌న్నీ మాత్రం బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఆ వివాహానికి హాజ‌రు కాలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో న‌వ‌దంప‌తుల్ని ఆశీర్వ‌దించ‌డానికి వెళ్లారు. కొత్త దంప‌తుల్ని ఆశీర్వ‌దించి...ఆ కుటుంబంతో ఓ గ్రూప్ ఫోటో దిగిన అనంత‌రం..బ్ర‌హ్మానందంతో ముచ్చటించారు. అనంత‌రం అక్క‌డ నుంచి వెనుదిరిగారు. బ్ర‌హ్మానందంతో ఉన్న బ‌న్నీ అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఇద్ద‌రు క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం బ‌న్నీ 'పుష్ప‌-2' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా పై జాతీయ అవార్డు రాక‌తో మ‌రింత బాధ్య‌త పెరిగింది. పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తోన్న సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.