Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాలో బ్రహ్మానందం.. క్రేజీ ప్రాజెక్ట్

గత ఏడాది తరుణ్ భాస్కర్ కీడాకోలా సినిమాలో కనిపించిన బ్రహ్మానందం ఈ ఏడాది ఆరంభంలో గేమ్ చేంజర్ మూవీలో నటించబోతున్నాడు

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:18 AM GMT
పాన్ ఇండియాలో బ్రహ్మానందం.. క్రేజీ ప్రాజెక్ట్
X

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గత కొన్నేళ్ళ నుంచి సినిమాలు భాగా తగ్గించేశారు. ఎవరైనా ఈ పాత్ర బ్రహ్మానందం తప్ప ఇంకెవరు చేయలేరు అని అనుకొని పిలిస్తే చేస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి 10కి తగ్గకుండా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఇప్పుడు సింగిల్ డిజిట్ లోనే మూవీస్ ఒప్పుకుంటున్నారు. అలాగే రెగ్యులర్ కామెడీ పాత్రలకి దూరం అవుతున్నారు. సీరియస్ రోల్స్ చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

గత ఏడాది తరుణ్ భాస్కర్ కీడాకోలా సినిమాలో కనిపించిన బ్రహ్మానందం ఈ ఏడాది ఆరంభంలో గేమ్ చేంజర్ మూవీలో నటించబోతున్నాడు. తాజాగా ఆయన మూవీ షూటింగ్ లో పాల్గొన్నారంట. మూడు రోజుల పాటు ఆయనకి సంబందించిన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం కనిపించనున్నాడు అంటే కచ్చితంగా సినిమాలో కామెడీకి స్కోప్ ఉందని అర్ధం.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాతో సోలోగా సాలిడ్ హిట్ సొంతం చేసుకోవాలని చరణ్ అనుకుంటున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కియరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ ని మూవీ కోసం శంకర్ తీసుకున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదానిపై క్లారిటీ లేదు. సంక్రాంతి ఫెస్టివల్ కి సినిమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసుకొని చరణ్ బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు.

ఆ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఉంటుందని తెలుస్తోంది. చరణ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలలో, రెండు భిన్నమైన టైమ్ లైన్స్ లో మూవీలో కనిపించనున్నాడు. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.