Begin typing your search above and press return to search.

ఐదు రూపాయల కోసం లారీలకు పెయింట్స్ వేసిన బ్రహ్మి..!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:30 AM GMT
ఐదు రూపాయల కోసం లారీలకు పెయింట్స్ వేసిన బ్రహ్మి..!
X

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రీసెంట్ గా బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీ గా నేను మీ బ్రహ్మానందం పుస్తకం రాశారు. తన జీవితంలో జరిగిన విషయాలను గురించి డీటైల్డ్ గా రాసుకొచ్చారు బ్రహ్మానందం. తెలుగు లెక్చరర్ అవ్వడం చేత స్వచ్చమైన తెలుగుని ఈ పుస్తకంలో రాశారు బ్రహ్మానందం.

తన ఆటో బయోగ్రఫీలో చిన్నప్పటి నుంచి తాను పడిన కష్టాలు, వేరే వాళ్ల సహాయంతో చదువుకున్న విధానం, సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు, తన కుటుంబ నేపథ్యం ఇలా అన్నిటి గురించి రాసుకొచ్చారు. అంతేకాదు బ్రహ్మానందం ఆయన గురించి ఇదివరకు ఎక్కడ తెలియని విషయాలను కూడా స్వయంగా బ్రహ్మానందం పుస్తకంలో రాసుకొచ్చారు.

బ్రహ్మానందం చదువు అంతా కూడా ఒకరి సహాయంతోనే నడిచిందట. తన టాలెంట్ చూసి అనసూయమ్మ లాంటి టీచర్లు కొంతమంది హెల్ప్ చేయగా తన చదువు పూర్తి చేశానని పుస్తకంలో రాసుకొచ్చారు బ్రహ్మానందం. స్కూల్ తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా వాళ్ల ఇళ్లలోనే పనులు చేసుకుంటూ పూర్తి చేశానని అన్నారు. డిగ్రీలో నాటకాలు, మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తూ చదువు కొనసాగించానని తెలిపారు.

డిగ్రీ బి.ఏ తెలుగు పూర్తయ్యాక ఎం.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి బ్రహ్మానందం దగ్గర డబ్బులేవట. ఈలోగా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేయడంతో అక్కడ సీటు కోసం ప్రయత్నిస్తే.. తన కళని, కామెడీని చూసి ఎం.ఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారని రాసుకొచ్చారు. అయితే చదువు కోసం సీట్ అయితే వచ్చింది కానీ హాస్టల్ లో ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. అంత డబ్బులు లేక గుంటూరు లోని నల్లపాడులో చిన్న గదుల్లో అద్దెకు ఉన్నానని ఆ టైం లో కూడా అనసూయమ్మ గారు తనకు సహాయం చేశారని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. మొత్తం డబ్బులు ఆమెను అడగలేక భోజనానికి సంపాదించుకోవాలని ఏదో ఒక పని చేద్దామని లారీలకు పెయింట్స్ వేశానని చెప్పారు బ్రహ్మానందం.

అప్పటికే బ్రహ్మానందంకి బొమ్మలు గీసే అలవాటు ఉంది. పెయింట్ పనేదో బాగుందని అనిపించి అక్కడ సహాయకుడిగా చేరారట. ఉదయం కాలేజీకి వెళ్లి రావడం సాయంత్రం పాత బట్టలు వేసుకుని లారీలకు పెయింట్ వేసే వారని రాసుకొచ్చారు. నెల జీతం గా కాకుండా వర్క్ ని బట్టి ఐదు రూపాయలు, రూపాయలు ఇచ్చే వారని పుస్తకంలో తెలిపారు బ్రహ్మానందం. 1970 లో ఆ డబ్బులు ఎక్కువే అని.. వాటితో పాటు వేరే వాళ్లు చేసిన సాయంతో రెండేళ్లు ఎం.ఏ పూర్తి చేసినట్టు రాసుకొచ్చారు. ఇప్పుడు హాస్య బ్రహ్మ అయిన బ్రహ్మానందం చిన్నప్పటి నుంచి తను పడిన కష్టాల గురించి తన బయోగ్రఫీ లో రాసుకొచ్చి తన అభిమానులకు మరింత స్పూర్తి కలిగేలా చేశారు.