Begin typing your search above and press return to search.

శివాజీ కొడుక్కి బ్రహ్మానందం ఉంగరం ఇచ్చి...!

ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమా విషయంలో పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో శివాజీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. తాజాగా బ్రహ్మానందం, అలీ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం మరింతగా సినిమా చర్చలో నిలిచేలా చేసింది.

By:  Ramesh Palla   |   4 March 2026 1:52 PM IST
శివాజీ కొడుక్కి బ్రహ్మానందం ఉంగరం ఇచ్చి...!
X

ప్రముఖ నటుడు శివాజీ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా విడుదలకు రెడీ అయింది. మార్చి 6న విడుదల కాబోతున్న ఈ సినిమాను శివాజీ స్వయంగా నిర్మించాడు. చాలా సంవత్సరాల తర్వాత శివాజీ సొంతంగా నిర్మించిన సినిమా కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తనకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో సినిమాను అంతకు మించి అన్నట్లుగా పబ్లిసిటీ చేశాడు. సినిమాను అనౌన్స్‌ చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వరకు అన్ని కార్యక్రమాలకు మంచి స్పందన దక్కింది. అంతే కాకుండా సినిమాకు సాధ్యం అయినంత ఎక్కువ పబ్లిసిటీ దక్కింది. ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమా విషయంలో పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో శివాజీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. తాజాగా బ్రహ్మానందం, అలీ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం మరింతగా సినిమా చర్చలో నిలిచేలా చేసింది.

బ్రహ్మానందం, అలీ ముఖ్య అతిథులుగా...

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్‌ కమెడియన్‌ బ్రహ్మానందం, అలీ, ప్రముఖ నటుడు/నిర్మాత అయిన బండ్ల గణేష్‌ లు పాల్గొన్నారు. ఇంతకు ముందు ఒక కార్యక్రమంలో శివాజీ తనయుడు రిషితో సినిమా తీస్తాను అంటూ అలీ ప్రకటించి డాలర్‌ను అడ్వాన్స్‌గా ఇవ్వడం జరిగింది. తాజా కార్యక్రమంలో శివాజీ కొడుకును స్టేజ్ మధ్యలోకి పిలిచి మరీ బ్రహ్మానందం ఇదుగో అడ్వాన్స్ అంటూ ఇచ్చాడు. శివాజీతో నీ కొడుక్కి అడ్వాన్స్ ఇస్తాను అంటూ బ్రహ్మానందం అన్నారు. ఆ వెంటనే పక్కనే ఉన్న శివాజీ తనయుడు రిషిని పిలిచి తన చేతికి ఉన్న వేలిని తీసి మరీ ఇచ్చాడు. నువ్వు ఏదో డాలర్‌ ఇచ్చావు అంటా కదా.. అది చెల్లదు ఇదుగో నేను రింగ్‌ ఇస్తున్నాను అంటూ బ్రహ్మానందం రింగ్‌ ఇవ్వడంతో అక్కడ ఉన్న వారు అంతా కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. చూడ్డానికి హీరోల ఉన్న రిషి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

బిగ్‌బాస్‌తో పరిచయం అయిన రిషి..

బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్‌ యొక్క ఆశీర్వాదం దక్కించుకున్న రిషి ఆ మధ్య బిగ్‌బాస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తండ్రి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో రిషి ని బిగ్‌బాస్ స్క్రీన్‌ పై ప్రేక్షకులు చూసిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే చాలా మంది రిషి హీరో మెటీరియల్‌ అంటూ కామెంట్‌ చేశారు. శివాజీ మాత్రం తన ఇద్దరు కొడుకులు వారి ఇష్టానికి ఏం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పెద్ద కొడుకు చదువు నిమిత్తం విదేశాల్లో ఉంటే, చిన్న వాడు మాత్రం హైదరాబాద్‌లోనే చదువుతున్నాడు. ఈ సినిమాకు రిషి సమర్పకుడిగా వ్యవహరించాడు. నిర్మాణ వ్యవహారాల్లోనూ రిషి భాగస్వామ్యం ఉన్నట్లుగా శివాజీ ఒకటి రెండు సార్లు చెప్పుకొచ్చాడు. నటుడిగా, నిర్మాతగా శివాజీ తన ప్రతిభ చూపించాడు. మరి తండ్రి బాటులో, బ్రహ్మానందం ఆశీర్వాదంతో నటుడిగా ఎదుగుతాడా అనేది కాలమే నిర్ణయించాలి.

శివాజీ హీరోగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని...

ఇక సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో శివాజీ పాత్రను చాలా విభిన్నంగా చూపించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో శివాజీని చూడబోతున్నాం. ఆయన పాత్రలోనే వేరియేషన్స్ కారణంగా ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా శివాజీ పాత్రలో ఉండే ట్విస్ట్‌, ఆ తర్వాత నుంచి వచ్చే సన్నివేశాల్లో శివాజీ నటన చాలా బాగుంటుందని అంటున్నారు. 90స్‌ బయోపిక్‌ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసంను శివాజీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో శివాజీకి జోడీగా లయ నటించింది. చాలా కాలం తర్వాత వీరి కాంబో రిపీట్‌ అయింది. గతంలో వీరిద్దరు పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మార్చి 6న పెద్ద సినిమాలు పోటీ లేని సమయంలో విడుదల అవుతున్న ఈ సినిమాకు చిన్న సినిమాలతో పెద్ద పోటీ ఉంది. మరి ఆ పోటీ నుంచి ఈ సినిమా ఏమేరకు తట్టుకుని నిలబడుతుంది అనేది చూడాలి.