Begin typing your search above and press return to search.

బ్రహ్మానందం జీవిత చరిత్రకు చ‌ర‌ణ్ మ‌ద్ధ‌తు

హాస్య బ్ర‌హ్మీ .. కామెడీ కింగ్ బ్రహ్మానందం 'నేను' పేరుతో తన ఆత్మకథను ఇటీవల ఆవిష్కరించారు

By:  Tupaki Desk   |   10 Jan 2024 1:36 PM GMT
బ్రహ్మానందం జీవిత చరిత్రకు చ‌ర‌ణ్ మ‌ద్ధ‌తు
X

హాస్య బ్ర‌హ్మీ .. కామెడీ కింగ్ బ్రహ్మానందం 'నేను' పేరుతో తన ఆత్మకథను ఇటీవల ఆవిష్కరించారు. ఈ ఈ పుస్తకం విస్తృత ఆసక్తిని రేకెత్తించింది. ఈ పుస్త‌కంలో కంటెంట్ ప‌రంగానే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి గొప్ప గుర్తింపు ఆమోదం పొందింది. సుదీర్ఘ కెరీర్ జ‌ర్నీలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో న‌టించి ఆయా విజ‌యాల్లో భాగం అయిన ప్ర‌ముఖుడిగా బ్రహ్మానందం జీవిత కథకు తన మద్దతును అందిస్తూ రామ్ చ‌ర‌ణ్ తన అధికారిక సోషల్ మీడియాలో దీనిని ప్ర‌మోట్ చేసారు.


బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఒక ఫోటోని చ‌ర‌ణ్ స్వ‌యంగా పోస్ట్ చేశారు.''#బ్రహ్మానందం గారు 'నేను'లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రాసారు. త‌న‌ అద్భుతమైన ప్రయాణం ప్రారంభ రోజుల గురించి.. హాస్యన‌టుడిగా ఆయ‌న పూర్తి జీవితాన్ని ఈ ఆత్మకథలో రివీల్ చేసారు. ఈ పేజీలు జీవిత‌ సారాంశాన్ని పొందుప‌రిచాయి. జీవిత పాఠాలను మనందరికీ అందించారు'' అని తెలిపారు. ద‌శాబ్ధాల పాటు బ్ర‌హ్మీ పండించిన హాస్యం వినోదం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎంతో గొప్ప ప్ర‌భావం చూపాయి. చ‌ర‌ణ్ న‌టించిన‌ బ్రూస్ లీ: ది ఫైటర్-ఆరెంజ్-రచ్చ-చిరుత-నాయక్-బెట్టింగ్ రాజా వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో బ్ర‌హ్మానందం న‌టించారు. ఆ ఇరువురి కాంబినేష‌న్ తెలుగు చిత్రీసీమ‌లో ప్ర‌త్యేక ముద్ర వేసింది.

రామ్ చరణ్, ప్రస్తుతం ఎస్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. RC 16 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితోను ఓ సినిమా చేయ‌నున్నాడు.

బ్రహ్మానందం ఆత్మకథను ప్రశంసిస్తూ.. మెగా స్టార్ చిరంజీవి కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు, సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో బ్ర‌హ్మీ పాత్ర అస‌మాన‌మైన‌ది. ఒక‌ ట్విట్టర్ పోస్ట్‌లో చిరంజీవి తన 40 సంవత్సరాల సినిమా అనుభవాలను 'నేను'లో షేర్ చేస్తున్నందున‌ బ్రహ్మానందాన్ని ప్రశంసించారు. ఈ ప్ర‌య‌త్నం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. మార్గదర్శకత్వం వ‌హిస్తుంది అని తెలిపారు.

బ్రహ్మానందం 'నేను' ఇప్పుడు అమెజాన్ .. ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 275. ఈ పుస్తకం పాఠకులకు బ్ర‌హ్మీ గురించిన ఎన్నో విష‌యాలను వెల్ల‌డిస్తుంది. నేను కేవలం ఆత్మకథ మాత్రమే కాదు ..స్ఫూర్తిదాయకమైన మార్గదర్శిని కూడా. ప్రారంభంలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉండి, చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన హాస్య బ్ర‌హ్మీ.. ది గ్రేట్ మాస్ట్రో జీవితంపై గొప్ప విష‌య‌ల‌ను వెల్ల‌డిస్తుంది.