Begin typing your search above and press return to search.

తాతామనవళ్లుగా తండ్రీకొడుకులు.. క్రేజీ ప్రాజెక్ట్

ఇప్పటి వరకు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసిన ఆయన.. తొలిసారి కొడుకుతో మూవీ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2024 7:26 AM GMT
తాతామనవళ్లుగా తండ్రీకొడుకులు.. క్రేజీ ప్రాజెక్ట్
X

టాలీవుడ్ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ఆడియన్స్ నవ్వేస్తారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ఇప్పటి వరకు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసిన ఆయన.. తొలిసారి కొడుకుతో మూవీ చేయబోతున్నారు.


పెద్ద కొడుకు, హీరో రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మానందం సినిమా చేయనున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన వీళ్లద్దరూ.. 'బ్రహ్మఆనందం' మూవీలో తాతామనవళ్లుగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుకు RVS నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి వచ్చిన మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద చిత్రాలు మంచి హిట్ అయ్యాయి.

ఇటీవల VIBE చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు రాహుల్ యాదవ్. తాజాగా 'బ్రహ్మఆనందం' సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తూ ప్రీ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పట్ణణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనంగా పోస్టర్ ఉంది. వీడియోలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తమ నెక్స్ట్ మూవీ కోసం ఫన్నీగా సంభాషించుకుంటున్నట్లు చూపించారు.

తండ్రీకొడుకులు తాతామనవళ్లుగా సినిమాలో కనిపించడం ఆకట్టుకునే విషయమే. ఈ 'బ్రహ్మఆనందం' సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించనున్నారు. శాండిల్య పీసపాటి మ్యూజిక్ ను అందించనున్నారు. మితేష్ పర్వతనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఈ మూవీకి ప్రసన్న.. ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'బ్రహ్మఆనందం' మూవీలో మనవడు బ్రహ్మాగా రాజా గౌతమ్, తాత ఆనంద్ రామమూర్తిగా బ్రహ్మానందం కనిపించనున్నట్లు తెలిపారు. మరి వీరిద్దరి జర్నీ చుట్టూ తిరగనున్న ఈ సినిమా.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.